Bandlaguda Mayor : రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మేయర్ పై నెగ్గిన అవిశ్వాసం..!!

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం( Rangareddy Gandipet ) బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

దీంతో మేయర్ పదవిని మహేందర్ గౌడ్( Mahender Goud ) కోల్పోయారు.

కాగా మేయర్ మహేందర్ గౌడ్ కు వ్యతిరేకింగా 16 మంది కార్పొరేటర్లు ఓట్లు వేశారు.రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి సమక్షంలో ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది.

అయితే ఈ ఓటింగ్ కు మహేందర్ గౌడ్ వర్గానికి చెందిన కార్పొరేటర్లు హాజరు కాలేదు.ఇటీవల మేయర్ మహేందర్ గౌడ్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ మేయర్ గా లతా ప్రేమ్ గౌడ్( Latha Prem Goud ) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు