ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ హడావిడి గట్టిగా జరుగుతున్నా సంగతి తెలిసిందే.ప్రధాన పార్టీలన్నీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి.
అయితే గత మూడు నెలలకు ముందు అధికారం మాదే అన్న రీతిలో నానా హడావిడి చేసిన బీజేపీ ప్రస్తుతం నిశబ్ధంగా వ్యవహరిస్తోంది.దీంతో బీజేపీ చుట్టూ ఎన్నో అనుమానాలు చర్చకు దాటి తీస్తున్నాయి.
ఎన్నికల్లో గెలుపుపై బీజేపీకి నమ్మకం లేదా ? అందుకే బీజేపీ ప్రచారాలకు దూరంగా ఉంటుందా ? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది ? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీ తెలంగాణలో కూడా డీలా పడింది.
![Telugu Congress, Dk Aruna, Etela Rajender, Kishan Reddy, Telangana Bjp, Ts-Polit Telugu Congress, Dk Aruna, Etela Rajender, Kishan Reddy, Telangana Bjp, Ts-Polit](https://telugustop.com/wp-content/uploads/2023/11/Telangana-bjp-ts-elections-Etela-Rajender-ts-politics-Etela-Rajender-D-K-Aruna.jpg)
పార్టీలోని కీలక నేతలు కూడా అంటిఅంతనట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఈ పరిణామాలతో కమలంపార్టీ కుదేలవుతోంది.అంతేకాకుండా పార్టీలోని కీలక నేతలంతా ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా ఆ పార్టీలో కాన్ఫిడెన్స్ లోపించడానికి కారణమంటున్నారు విశ్లేషకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి,( Kishan Reddy ) ఉప అద్యక్షురాలు డికె అరుణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మొరళీధర్ రావు కూడా ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు.
ఇక కీలక నేతలే ఎన్నికల రేస్ నుంచి తప్పుకోవడంతో బిఆర్‌ఎస్, మరియు కాంగ్రెస్ పార్టీలు కూడా బీజేపీ( BJP )ని లైట్ తీసుకున్నాయి.
![Telugu Congress, Dk Aruna, Etela Rajender, Kishan Reddy, Telangana Bjp, Ts-Polit Telugu Congress, Dk Aruna, Etela Rajender, Kishan Reddy, Telangana Bjp, Ts-Polit](https://telugustop.com/wp-content/uploads/2023/11/ts-elections-Etela-Rajender-brs-congress-kishan-reddy-ts-politics-Etela-Rajender.jpg)
అయితే కమలం పార్టీలో ఈ రకంగా కాన్ఫిడెన్స్ లోపించడానికి కారణం ఎంటనే దానిపై విశ్లేషకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.పార్టీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ( Etela Rajender )వంటి నేతల మద్య సక్యత లేకపోవడం ఒక కారణమైతే.ఎంత పోరాడిన గెలిచే పరిస్థితి లేదనే అభిప్రాయం మరికొందరిలో ఉందట.
అందుకే ఈ ఎన్నికలను బీజేపీ రాష్ట్రనేతలు నామమాత్రంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.కానీ పార్టీ అధిష్టానం మాత్రం తెలంగాణ విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తోంది.
పార్టీ అగ్రనేతలు తరచూ రాష్ట్రానికి వస్తూ రాష్ట్ర నేతల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.అయినప్పటికి బీజేపీలో ప్రచార పరిస్థితులు మందకొడిగానే సాగుతున్నాయి.
మరి గెలుపు విషయంలో కాన్ఫిడెంట్ గా లేని కమలం పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.