కాంగ్రెస్ బీజేపీలో నో క్లారిటీ ?

తెలంగాణలో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది.ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

ముఖ్యంగా ఈసారి గెలుపు కోసం అధికార బి‌ఆర్‌ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా గట్టిగా పోటీ పడుతున్నాయి.ఒకవైపు అభ్యర్థులను ప్రకటించి బి‌ఆర్‌ఎస్ దూకుడు మీద ఉంటే.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జన పడుతూనే ఉన్నాయి.ఇదే ఇంకా వీడని చిక్కుముడిలా ఉంటే.

ఈ రెండు పార్టీలను మరో సమస్య కూడా వేధిస్తోంది.

Advertisement

అదే సి‌ఎం అభ్యర్థి ఎవరనే అంశం. టి కాంగ్రెస్ లో సి‌ఎం అభ్యర్థి కోసం గట్టిగా పోటీ పడుతున్నారు కొందరు అభ్యర్థులు రేవంత్ రెడ్డితో పాటు, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారితో పాటు సీతక్క( Seethakka ) కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నారు.వీరిలోనే ఎవరో ఒకరు సి‌ఎం అభ్యర్థిగా ఎంపిక కావడం ఖాయంగా తెలుస్తోంది.

అయితే ఆ మద్య సీతక్కను సి‌ఎం అభ్యర్థిగా నిలబెడతామని టీపీసీసీ చీఫ్ పరోక్షంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.అయితే సీతక్క సి‌ఎం అభ్యర్థిగా ఉండడానికి ఇతర నేతలు ఎంతవరుకు మద్దతిస్తారనేది ప్రశ్నార్థకమే.

అటు బీజేపీలో నిన్న మొన్నటి వరకు సి‌ఎం అభ్యర్థి రేస్ లో బండి సంజయ్( Bandi Sanjay ) పేరు గట్టిగా వినిపించింది.ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దీంతో ఆయన సి‌ఎం అభ్యర్థిగా ఉంటారా లేదా అనేది చెప్పలేని పరిస్థితిగా మారింది.

ఇక ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న కిషన్ రెడ్డి కూడా ఆ పార్టీ నుంచి సి‌ఎం అభ్యర్థి రేస్ లో పోటీదారుడే.దీంతో బీజేపీ అధిష్టానం ఎవరిని సి‌ఎం అభ్యర్థిగా నిలబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 

అయితే అటు కాంగ్రెస్ గాని ఇటు బీజేపీగాని వచ్చే నెలలో మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.ఈ జాబితాతో పాటుగా సి‌ఎం అభ్యర్థులపై కూడా ఈ రెండు పార్టీలు క్లారిటీ ఇస్తాయా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు