టాలీవుడ్ లో ఏ హీరోయిన్ ఎప్పుడు ఎలా లక్ కలిసి వస్తుందో చెప్పడం కష్టం.ఓ మోస్తారుగా ఉన్నా సరే వరుస ఛాన్సులతో నెట్టుకొస్తుంటారు కొందరు భామలు.
అయితే అందం అభినయం ఉన్నా సరే కొంతమంది భామలు మాత్రం కెరియర్ లో వెనకపడతారు.అలాంటి వారిలో అమృత అయ్యర్ ఒకరని చెప్పొచ్చు.
రామ్ రెడ్ సినిమాలో నటించిన ఆమె యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నటించింది.ఆ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా తర్వాత ఓ రేంజ్ లో అవకాశాలు వస్తాయని ఆశిస్తే అది రివర్స్ అయ్యింది.
ప్రదీప్ సినిమా తర్వాత తెలుగులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన అర్జున ఫల్గుణ సినిమాలో మాత్రమే నటించింది అమృత.
ఆ సినిమా కూడా ఫెయిల్ అయ్యే సరికి అమ్మడికి అవకాశాలు రాకుండా పోయింది.స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్నా కూడా అమృతకి తెలుగులో లక్ కలిసి రాలేదని చెప్పొచ్చు.
అయితే తెలుగులో ఇలాన్ ఉంటే తమిళంలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది అమృత అయ్యర్.ప్రస్తుతం తెలుగులో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ మూవీలో నటిస్తుంది అమృత.
ఈ సినిమాతో అయినా అమడు తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.