బాబా ... మీ నూడుల్సుకు అనుమతి లేదు

దేశంలో మొన్నటివరకు మ్యాగీ నూడుల్స్ వివాదం నడిచింది.

అది ఓ కొలిక్కి వచ్చింది అనుకోగానే యోగా గురు బాబా రాందేవ్ నూడుల్స్ వ్యవహారం తెర మీదికి వచ్చింది.

పతంజలి బ్రాండ్ పేరుతో బాబా రామ్ దేవ్ తయారు చేస్తున్న ఆయుర్వేదిక్ మందులు బాగా పాపులర్ అయ్యాయి.అనేకమంది ఈ మందుల డీలర్షిప్ తీసుకుని అమ్ముతున్నారు.

కొన్ని మందులు వివాదాస్పదం అయ్యాయి కూడా.వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో వుండే రాందేవ్ ఇన్ స్టాంట్ నూడుల్స్ తయారు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

రాందేవ్ తయారు చేసిన నూడుల్సుకు కేంద్ర ఆహార నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి లేదట.అనుమతి లేకుండా , లైసెన్సు లేకుండా రాందేవ్ తన నూడుల్సు మార్కెట్లోకి విడుదల చేశారని ఆహార నియంత్రణ సంస్థ చైర్మన్ ఆశిష్ బహుగుణ చెప్పారు.

Advertisement

పతంజలి సంస్థ తయారు చేస్తున్న ఇతర ఉత్పత్తులకు అనుమతి ఉంది.దేశంలో పది కంపెనీలు నూడుల్సు తయారు చేస్తున్నాయి.

వీటికి అనుమతి ఉంది.అయితే పాస్తా అనే తమ ఉత్పత్తికి ఆహార నియంత్రణ సంస్థ ఆమోదం ఉందని, నూడుల్సు కూడా ఆ కేటగిరి కిందకే వస్తుందని, కాబట్టి ప్రత్యేకంగా అనుమతి తీసుకోలేదని రామ్ దేవ్ చెప్పారు.

అయితే ఇది పెద్ద వివాదం కాకపోవచ్చు.ఇది సాంకేతికమైన విషయమే తొందరలోనే పరిష్కారం కావచ్చు.

నూడుల్సులో నాణ్యత లోపం లేకపోతే అనుమతి ఇవ్వడం కష్టం కాదు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు