రానా హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతున్న విరాట పర్వం సినిమాలో మరో హీరోయిన్ గా నివేదా థామస్ నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
ఈ సినిమాలో నటించబోతున్నది నివేదా థామస్ కాదని నివేథా పేతురాజ్ అంటూ పేర్కొన్నారు.రంగస్థలం సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం ఈమెకు సంబంధించిన సినిమాలు పలు సెట్ పై ఉన్నాయి.వచ్చే ఏడాది ఈమె నటిస్తున్న అయిదు ఆరు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ సమయంలోనే రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా ఈమెకు అవకాశం వచ్చింది.రెండేళ్లుగా ఈ సినిమా చర్చలు జరుగుతున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని ఒక ముఖ్య పాత్రకు గాను నివేథా పేతురాజ్ ను దర్శకుడు వేణు ఉడుగుల ఎంపిక చేశాడు.ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయిన ఈ సినిమాలో రానా మరియు సాయి పల్లవిలు పాల్గొంటున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల చివరి వరకు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.వచ్చే సమ్మర్ లో విడుదల చేసేందుకు గాను చిత్ర యూనిట్ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నక్సల్స్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే విషయం తెల్సిందే.ప్రియ మణి నక్సలైట్ గా కనిపించబోతుందట.
ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ గా మరియు నక్సలైట్ గా కూడా కనిపించబోతున్నట్లుగా మేకర్స్ చేబుతున్నారు.సాయి పల్లవి లుక్ కు ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకుంది.