నితిన్, శ్రేష్ట్ మూవీస్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఊర మాస్ ట్రైలర్ విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, ‘మాచర్ల యాక్షన్ ధమ్కీ’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి.

 Nithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam Oora Mass Trailer Released ,-TeluguStop.com

గుంటూరులోని బ్రోడీపేట్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి.

రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది.

నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్ గా మొదలైన ట్రైలర్.వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది.

కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గా నితిన్ మాచర్లలోకి ఎంటరవ్వడంతో కంప్లీట్ యాక్షన్‌తో మాస్ ఫీస్ట్ గా మెస్మరైజ్ చేసింది.

రాజప్ప గా సముద్రఖని విలన్ ఎంట్రీ టెర్రిఫిక్ గా వుంది.

మాచర్ల లో రాజప్ప తిరుగులేని శక్తి.తన బలంతో ఎన్నికలే లేకుండా ఎమ్మెల్యే గా ఏకీగ్రీవంగా ఎన్నికౌతుంటాడు.

ఐతే నియోజక వర్గంలో ఎన్నికలను నిర్వహించి తీరుతానని, కలెక్టర్ అది నా భాద్యతని నితిన్, రాజప్పతో ఛాలెంజ్ చేయడం పవర్ ఫుల్ గా వుంది.

నితిన్ క్యాజువల్స్ లో స్టన్నింగా కనిపిస్తూనే ఇన్ బిల్ట్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ బ్రిలియంట్ అనిపించాడు.ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి.“నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ ల పంచ్ లు, వీళ్ళేమో బోయపాటి శ్రీనుల యాక్షన్.ఇప్పుడు నేనేం చెయ్యాలి.రాజమౌళి హీరో లా ఎలివేషన్ ఇవ్వాలా” ఈ ఒక్క డైలాగ్ వింటే సినిమా ఏ స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తోందో అర్ధమౌతుంది.

ట్రైలర్‌లోని యాక్షన్‌ షాట్‌లు అడ్రినాలిన్‌ రష్ ఎఫెక్ట్ ని ఇచ్చాయి.అద్భుతమైన విజువల్స్, మాస్ డైలాగ్స్ ,క్రాకింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన యాక్షన్ ట్రైలర్‌ సెన్సేషనల్ గా వుంది.

శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది.

మహతి స్వర సాగర్ ట్రైలర్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం పవర్ ప్యాక్డ్ అనిపించింది.

మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ యాక్షన్ , ఎంటర్‌టైన్‌మెంట్ గా సినిమాపై భారీ అంచనాలని పెంచింది.

మాంచి యాక్షన్, ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ‘మాచర్ల నియోజకవర్గం’ పర్ఫెక్ట్ బాక్సాఫీసు ఫీస్ట్ అని చెప్పాలి.

ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు.

రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్‌ రారా రెడ్డిలో సందడి చేస్తోంది.

ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube