ఈ భూప్రపంచంలో మనిషికి తెలివే అసలైన పెట్టుబడి.తెలివితేటలు ఉంటే మనిషి ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోగలుగుతాడు.
ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగా జీవనం సాగించగలడు.తెలివితో చేతిలో రూపాయి లేకపోయినా లక్షల రూపాయలు ఆర్జించగలడు.
నిర్మల్ జిల్లాలోని గంగాధర్ గురించి తెలిస్తే తెలివి ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించవచ్చని అర్థమవుతుంది.
నిర్మల్ జిల్లాలోని చించోలిబి గ్రామానికి చెందిన కోంతం గంగాధర్ కొన్ని నెలల క్రితం వరకు ఉద్యోగం చేసుకుని జీవనం సాగించేవాడు.
నెలకు అతనికి లక్షల రూపాయల వేతనం వచ్చేది.అయితే ఊహించని విధంగా వ్యాప్తి చెందిన కరోనా, లాక్ డౌన్ వల్ల గంగాధర్ ఉద్యోగం పోయింది.కొత్త ఉద్యోగం దొరికే పరిస్థితులు లేకపోవడంతో గంగాధర్ కు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పలేదు.
దీంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న గంగాధర్ కు తందూరీ చాయ్ ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన వచ్చింది.
అనుకున్నదే తడవుగా తందూరీ చాయ్ ను తయారీ చేసి ఆ టీ రుచి ప్రజలకు తెలిసేలా చేశాడు.సాధారణ టీలతో పోల్చి చూస్తే ఈ టీ మరింత రుచిగా ఉండటంతో జనం ఆ టీ స్టాల్ ముందు క్యూ కట్టారు.
ఇటలీలోని రెస్టారెంట్ లో ఉద్యోగం చేసే గంగాధర్ కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయాడు.
సొంతూరికి తిరిగి వచ్చిన గంగాధర్ కుండలో తందూరి చాయ్ ను తయారు చేసి ఆ చాయ్ కుండలో ఇచ్చేవాడు.రోజుకు గంగాధర్ చాయ్ కోసం 60 లీటర్ల పాలు వినియోగిస్తున్నాడంటే అతని టీ ఎంత రుచిగా ఉంటుందో అర్థమవుతుంది.10 రూపాయల ఖరీదు చేసే ఈ చాయ్ ఎంతో రుచిగా ఉంటుందని టీ తాగిన వాళ్లు చెబుతున్నారు.కొత్త రకం చాయ్ ను రుచి చూపిస్తున్న గంగాధర్ తెలివిని మెచ్చుకుంటున్నారు.