అధికార పార్టీ అంటే చెప్పేది ఏముంది .? ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది.తమకు వ్యతిరేకంగా ఎవరన్నా కుట్రలు పన్నుతున్నారు అని తెలిస్తే ఎంతటి వారినైనా ఇబ్బంది పెట్టాలని చూస్తారు.ఇక సొంత పార్టీలో ఉండి వెనుక గోతులు తీస్తున్నాడు అని తెలిస్తే ఊరుకుంటారా .? తమ చేతికి మట్టి అంతకుంటా వ్యవహారం చక్కబెట్టేస్తారు.ఇప్పుడు అలాగే టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ విషయంలోనూ అదే జరుగుతోంది అన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కొద్ది కాలంగా డీఎస్ పై అధికార పార్టీ గుర్రుగా ఉంది.
ఆయన్ను పొమ్మనలేక పొగపెడుతూ అధికార పార్టీ టీఆర్ఎస్ కక్ష తీర్చుకుంటోంది.ఆయన ఏ విషయంలో దొరుకుతాడా ఇరుకున పెడదామా అని చూస్తున్న అధికార పార్టీకి డిఎస్ కుమారుడి రూపంలో కలిసి వచ్చింది.
దీంతో ఇన్నాళ్లూ ఆయన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియని నేతలు ఇప్పుడు ఆయన కొడుకు వైపు నుంచి విమర్శల దాడి చేసే అవకాశం దొరికింది.ఆయన కొడుకుపై నిర్బయ కేసు నమోదు కావడంతో డీఎస్ కు ఏమి చెయ్యాలో తెలియని అయోమయంలో పడిపోయాడు.

డీఎస్ కొడుకు సంజయ్ పై పోలీసు కేసు నమోదైంది.ఈ పరిమాణాలన్నీ చూస్తే డీఎస్‌కు పొగబెడుతున్నట్లేనని అంతా అభిప్రాయప డుతున్నారు.అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు సాగుతోంది.నిజామాబాద్‌లో ఇది ఒకింత ఎక్కువగానే ఉంది.ఎంపీగా కవిత ప్రాతినిధ్యం వహిస్తుండడం, జిల్లా అంతటా ఈ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలే ఉండడంతో అంతర్గత పోరు అధికంగానే ఉంది.
డీఎస్ కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని రెండు నెలల క్రితం జిల్లా నేతలు తీర్మానించి చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయంగా కలకలం రేపిన ఈ రెండు ఫిర్యాదులనూ సీఎం కేసీఆర్ పెండింగ్‌లో ఉంచారు.అనూహ్యంగా డీఎస్ కొడుకు సంజయ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం పోలీసు శాఖ వెంటనే స్పందించడం నిర్భయ సహా నాలుగు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
వాస్తవానికి సంజయ్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి.ఉన్నట్టుండి ఇప్పుడే వాటిని తెరపైకి తెచ్చి కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.