అక్కడ ఏడాదికి ఐదు గంటలే ఆలయం తెరిచి ఉంటుందట!

మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.దేవుడి ఆలయాలతో పాటు కొన్ని చోట్ల కోతులకు, మనుషులకు, సినిమా హీరోలకు కూడా గుడులున్నాయి.

చాలా వరకు ఇవి ప్రతి రోజూ తెరిచే ఉంటాయి.ఇంకొన్ని చోట్ల ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే తెరుస్తారు.

ఛార్ ధామ్, శబరిమల వంటి పుణ్య క్షేత్రాలకు ఏడాదిలో నెల, రెండు నెలల చొప్పున భగవంతుడి దర్శన భాగ్యం కల్పిస్తారు.కానీ ఛత్తీస్ గఢ్ లోని నీరయ్ మాతా ఆలయం ఏడాదికి ఐదు గంటలు మాత్రమే తలుపులు తెరుచుకుంటాయట.

ఈ ఆలయం ఎక్కడుందో.అక్కడ ఎలాంటి పూజలు చేస్తారో మనం తెలుసుకుందాం.

Advertisement
Nirai Mata Temple Open Only Five Hours In A Year Details, Nirai Mata Temple, Cha

ఛత్తీస్ గఢ్ లోని గరియాబాద్ జిల్లా కేంద్రానికి 12 కిలో మీటర్ల దూరంలో కొండపై ఉన్న నీరయ్ మాతా ఆలయాన్ని ప్రతి ఏటా ఛైత్ర నవరాత్రి రోజు తెల్లవారు జామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు తెరుస్తారు.ఆ ఒక్క రోజే ఈ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడంతో… ఆరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వస్తారు.

అంతే కాదండోయ్ ఇక్కడ కేవలం కొబ్బరి కాయ కొట్టి, అగరు బత్తులు మాత్రమే వెలిగిస్తారు.

Nirai Mata Temple Open Only Five Hours In A Year Details, Nirai Mata Temple, Cha

ఇంకెలాంటి పూజలు చేయరు.అంతే కాదండోయ్ నీరయ్ మాతా ఆలయంలో ఛైత్ర నవరాత్రుల సమయంలో దీపం దానంతట అదే వెలుగుతుందట.నూనె లేకపోయినా తొమ్మిది రోజుల పాటు ఆ దివ్య జ్యోతి వెలుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఇలా దీపం దానంతట అదే వెలగడానికి కారణమేంటో మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు