గూగుల్ యాప్స్ లో ఇబ్బందులు ఎదురయితే కస్టమర్ సపోర్ట్ కోసం ఏమి చేయాలంటే..?!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లోను స్మార్ట్‌ఫోన్ ఉండడం మనం చూస్తూనే ఉన్నాము.ఫోన్ లేనిదే అసలు రోజే గడవదు.

 What To Do For Customer Support If You Have Problems With Google Apps ,google Ma-TeluguStop.com

ఏ పని చేయాలన్నా గాని ఫోన్ కావాలి.ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ తప్పకుండా అవసరం పడుతుంది.

మరి ముఖ్యంగా ఇప్పుడు చాలా అవసరాల కోసం గూగుల్ అసిస్ట్ పై ఆధారపడుతున్నాం.చాలా రకాల అవసరాలను తీర్చుకోవడానికి గూగుల్ సేవలను ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నాం.

ఈ క్రమంలోనే చాలా రకాల గూగుల్ సేవలు అనేవి యాప్స్ రూపంలోను , సర్వీసెస్ రూపంలోను మనకు అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ యాప్స్ ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మొండికేస్తాయి.

అలాంటప్పుడు ఫోన్ రీస్టార్ట్ చేయడంగాని లేదంటే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం గాని చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.కానీ కొన్ని సందర్భాల్లో ఏమి చేసినాగాని సమస్య తీరదు.

అలాంటి సందర్భాల్లో గూగుల్ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.మరి ఎలా గూగుల్ కస్టమర్‌ను కాంటాక్ట్ చేయాలి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

అందుకే అలాంటి సందర్భాల్లో గూగుల్ సపోర్ట్ ను ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం.ముందుగా గూగుల్ సపోర్ట్ ఎలా పొందాలి అంటే మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి.ఓపెన్ అయ్యాక అక్కడ సెర్చ్ లో ‘support.google.com’ యూఆర్ఎల్‌ను ఎంటర్ చేయండి.ఆ తరువాత మీకు ఈ పేజీలో అన్ని గూగుల్ యాప్స్, సేవలు కనిపిస్తాయి.

అప్పుడు మీకు ఏ యాప్ తో అయితే ఇబ్బంది ఉందో ఆ యాప్ లేదా సర్వీస్‌ పై క్లిక్ చేసి కస్టమర్ సపోర్ట్‌కు కాంటాక్ట్ చేయాలి.

అప్పుడు మళ్ళీ కిందకు వెళ్లగానే ఒక బాణం గుర్తు కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్ల లిస్ట్ కనిపిస్తుంది.మీరు ఏదైనా యాప్ లేదా సేవలపై క్లిక్ చేసిన తర్వాత, కొన్ని ప్రశ్నలతో కూడిన ఒక కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది.అప్పుడు మీ సమస్యకు సంబంధించిన ప్రశ్నను సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు ఆన్సర్ పొందవచ్చు.

అయితే అక్కడ ఉన్న ప్రశ్నలలో మీ సమస్యకు పరిష్కారం చూపే ఆన్సర్ లేకపోతే కిందకు స్క్రోల్ చేయండి.

Telugu Crome Browser, Google Apps, Google Assist, Google Map, Google, Ups, Smart

అక్కడ మీకు ‘Need more help’ అనే లింక్‌ కనిపిస్తుంది.అక్కడ క్లిక్ చేయాలి.అనంతరం Contact us అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేయగానే మీ సమస్యకు సంబంధించిన కొన్ని వివరాలను గూగుల్ మిమ్మల్ని అడగుతుంది.అప్పుడు మీకు కావాల్సిన సపోర్ట్ గురించి మీ ప్రశ్నను కింద ఉండే బాక్స్‌లో రాసి Next అనే ఆప్షన్‌పై నొక్కాలి.

ఆ వెంటనే మీ ప్రశ్నను గూగుల్‌కు పంపడానికి ఈమెయిల్ లేదా చాట్ బటన్‌పై క్లిక్ చేయండి అంతే.అయితే యూజర్లకు చాట్ చేసే ఆప్షన్ అనేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube