కొడాలి నాని పై కేసు ఫైల్ అంటూ నిమ్మగడ్డ ఆదేశాలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అదే విధంగా మంత్రుల మధ్య వాతావరణం నువ్వా నేనా అన్నట్టు గా నెలకొని ఉంది.ఏస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ క్రమంలో చాలా దూకుడుగా ఉంటూ ఎన్నికల సంఘం పై అదేవిధంగా తనపై విమర్శలు చేసే మంత్రులకు నోటీసులు ఇవ్వటమే కాక మీడియా ముందు కూడా రాకూడదంటూ పలు ఆదేశాలు ఇవ్వటం అటుపక్క మంత్రులు కూడా ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన రీతిలో వ్యవహరించడం జరుగుతుంది.

 Nimmagadda Orders File Case Against Kodali Nani Nimmagadda Ramesh Kumar, Koda-TeluguStop.com

ఇదిలా ఉంటే నిన్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నిమ్మగడ్డ పై చేసిన వ్యాఖ్యలకు .ఆయన షోకాజ్ నోటీసులు పంపటం కాక సాయంత్రం లోగా వివరణ ఇవ్వాలని కూడా తెలపడం జరిగింది.దీంతో నిమ్మగడ్డ పంపిన షోకాజ్ నోటీసులు విషయంలో కొడాలి నాని హైకోర్టు కి వెళ్లడం జరిగింది.అయితే ఇంకా కొడాలి నాని వేసిన పిటిషన్ విచారణకు రాకముందే కృష్ణా జిల్లా ఎస్పీ కి ఏస్ఈసీ ని బెదిరించినట్టు కొడాలి నాని పై క్రిమినల్ కేసు పెట్టాలని నిమ్మగడ్డ ఆదేశాలు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

అంతేకాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టాలని కూడా పేర్కొన్నారు.దీంతో నిమ్మగడ్డ ఆదేశాల మేరకు  కృష్ణా జిల్లా పోలీసులు కొడాలి నాని పై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube