నిఖిల్ 'స్పై' మూవీ ఫుల్ రివ్యూ..ఎదో ఊహించుకొని వెళ్తే బుక్ అయిపోతారు!

నటీనటులు :

నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్, రానా దగ్గుపాటి , జిసు సంగుప్త, ఆర్యన్ రాజేష్ తదితరులు.

సంగీతం :

శ్రీ చరణ్ .

 Nikhil 'spy' Movie Full Review And Rating , Nikhil Siddhartha , Spy Movie , Spy-TeluguStop.com

సినిమాటోగ్రఫీ :

మార్క్ డేవిడ్.

నిర్మాత : రాజశేఖర్ రెడ్డి

.

డైరెక్టర్ : గర్రీ BH

.

Telugu Aryan Rajesh, Garry Bh, Iswarya Menon, Rana, Spy, Spy Review, Subhaschand

ప్రస్తుతం ఉన్న హీరోలలో కొత్త రకం కథలతో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని ఇవ్వడానికి పరితపించే హీరో నిఖిల్.నిఖిల్( Nikhil Siddhartha ) సినిమా వస్తుంది అంటే ఒక సెక్షన్ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు.ఇదంతా ఆయన తన కష్టం మీద తెచుకున్నదే.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి ఆడిషన్స్ ద్వారా ‘హ్యాపీ డేస్’ అనే సినిమా నుండి పరిచయమైన ఈయన, ఆ సినిమా తర్వాత కొన్ని అట్టర్ ఫ్లాప్ చిత్రాలలో నటించాడు కానీ, ‘స్వామి రారా‘ చిత్రం నుండి రూటు మార్చి, సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ, నేడు పాన్ ఇండియన్ స్టార్స్ లో ఒకడిగా నిలిచాడు.ఇక ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం స్పై, నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాడ్ గా హిందీ మరియు తెలుగు భాషల్లో విడుదల అయ్యింది.దీనికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాము.

కథ :

Telugu Aryan Rajesh, Garry Bh, Iswarya Menon, Rana, Spy, Spy Review, Subhaschand

జయ్(నిఖిల్ సిద్దార్థ్) రా ఏజెంట్ కి సంబంధించిన వ్యక్తి.ఇండియా లో అలజడి సుష్టిస్తున్న టెర్రరిస్ట్ ఖాదీర్ ఖాన్ ఆటలను అరికట్టడానికి స్పై ఏజెంట్ గా రంగం లోకి దిగుతాడు.మరో పక్క ఆయన ఇలాగే ఒక మిషన్ లో పాల్గొనడానికి వెళ్లిన తన అన్నయ్య సుభాష్ ( ఆర్యన్ రాజేష్) ( Aryan Rajesh )ని చంపిన వాళ్ళని వెతికి పట్టుకునే టాస్క్ ని కూడా సమాంతరంగా చేస్తూ ఉంటాడు.

ఈ రెండు టాస్కుల్లో నిమగ్నమై ఉన్న జయ్ కి నేతాజీ సుభాష్ చంద్ర బోస్( Subhas Chandra Bose ) కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ఫైల్ మిస్ అవుతుంది.దానిని కూడా వెతికే పట్టుకునే టాస్క్ జయ్ కి వస్తుంది.ఈ మూడు టాస్కులను ఆయన ఎలా పూర్తి చేసాడు?, ఇలా ఈ టాస్కులు చేస్తున్న సమయం లో అతనికి ఎదురైనా పరిస్థితులు ఏమిటి?, వచ్చిన మలుపులు ఏమిటి ?, ఇలాంటివన్నీ తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

Telugu Aryan Rajesh, Garry Bh, Iswarya Menon, Rana, Spy, Spy Review, Subhaschand

ఒక మంచి కాన్సెప్ట్ ని రొటీన్ టేకింగ్ తో ప్రేక్షకులకు బోర్ కొట్టించడం అంటే ఏమిటో ఈ సినిమాని చూసిన వాళ్లకు అర్థం అవుతుంది.ఇంత సబ్జెక్టు ఉన్నప్పుడు టేకింగ్ కి ఎంతో స్కోప్ ఉంటుంది.దర్శకుడు ఎంత కొత్తగా తీస్తే అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది.

కానీ ఇక్కడ కంటెంట్ ఉన్నా కూడా, పసలేని టేకింగ్ తో నాసిరకం ఫీలింగ్ ని రప్పించాడు డైరెక్టర్ గర్రీ BH( Garry BH).ఇలాంటి సబ్జక్ట్స్ కి భారీ బడ్జెట్ అనేది చాలా అవసరం, బడ్జెట్ పెట్టేందుకు ఫుల్ స్కోప్ ఉన్నప్పటికీ కూడా నిర్మాత రాజశేఖర్ ఎందుకో రిస్క్ చెయ్యలేదు అనిపించింది.నిర్మాత పెట్టిన బడ్జెట్ లిమిటేషన్స్ వల్లే డైరెక్టర్ అలా తడబడి తీసాడని రూమర్ కూడా ఇండస్ట్రీ లో ఉంది.ఫస్ట్ హాఫ్ మొత్తం అలా ఫ్లాట్ గా అలా సాగిపోతుంది కానీ, సెకండ్ హాఫ్ లో మాత్రం నేతాజీ సుభాష్ చంద్ర బాస్ కి సంబంధించిన మిస్సింగ్ ఫైల్ ఎపిసోడ్ ఆసక్తి క్రియేట్ చేస్తుంది.

కానీ అదే టెంపో ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు డైరెక్టర్.ఇక నిఖిల్ కి ఇలాంటి పాత్రలు చెయ్యడం కొత్తేమి కాదు, ఆయనకీ అలవాటే కాబట్టి, ఆయన పెర్ఫార్మన్స్ మనకి పెద్దగా ఏమి అనిపించదు.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఒక సినిమాకి హైప్ రావాలంటే కచ్చితంగా పాటలు క్లిక్ అవ్వడం తప్పనిసరి.కానీ ఈ చిత్రం లో ఒక్క పాట కూడా వినసొంపుగా అనిపించదు.

ఎదో సినిమా ఉంది కాబట్టి పాటలు పెట్టాలి అన్నట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్లకు.కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పట్వాలేదు అనిపించే విధంగా ఇచ్చాడు శ్రీచరణ్.బడ్జెట్ తక్కువ అయ్యినప్పటికీ క్వాలిటీ విషయం లో మాత్రం నిర్మాత రాజశేఖర్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు, ఈ ఒక్క విషయం లో ఆయనని మెచ్చుకోవచ్చు.

చివరి మాట :

సినిమాలో విషయం ఉంది కానీ, టేకింగ్ సరిగా లేదు.స్పై థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ చిత్రాన్ని చూడొచ్చు , కానీ కొత్తదనం మాత్రం ఆశించవద్దు.

రేటింగ్ : 2.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube