బీజేపీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ చేశారు.ఓ దున్నపోతును ఒక వ్యక్తి తన్ని ట్రాలీలో ఎక్కించే వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కావాల్సింది ఇలాంటి ట్రీట్ మెంట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.అంతేకాకుండా ఈ ట్వీట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ ను ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్ తెలంగాణ బీజేపీలో కలకలం చెలరేగింది.అయితే ఉదయం ఈ ట్వీట్ ను పోస్ట్ చేసిన జితేందర్ రెడ్డి కాసేపటి తరువాత డిలీట్ చేశారు.
మళ్లీ తిరిగి మధ్యాహ్నం రీపోస్ట్ చేశారు.అదేవిధంగా తెలంగాణ సోషల్ మీడియా తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకుందని ఆరోపించిన ఆయన తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
తాను కేవలం బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశించే వాళ్లకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు.







