నిఖిల్( Nikhil Siddhartha ) హీరోగా తెరకెక్కిన స్పై మూవీ( Spy movie ) మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే విడుదలైన స్పై ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
వరుస విజయాలతో జోరుమీదున్న నిఖిల్ తర్వాత ప్రాజెక్ట్ తో సైతం సక్సెస్ సాధించి వార్తల్లో నిలుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం గమనార్హం.
స్పై ట్రైలర్ కు ఇప్పటివరకు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగానే ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీతో ఈ సినిమా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.క్లాస్ ప్రేక్షకులు టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ సంఖ్యలో టెక్నీషియన్లు పని చేశారని తెలుస్తోంది.ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.రానా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
నిఖిల్ ఈ సినిమాతో మరో పాన్ ఇండియా సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నమ్ముతున్నారు.

జీరో కట్స్ తో ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు కావడం గమనార్హం.స్పై సినిమాలో గూస్ బంప్స్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయని సినిమాలోని కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నిఖిల్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ మూవీ సక్సెస్ సాధిస్తే నిఖిల్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.