అమెరికాలో అలాంటి ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా కార్తికేయ 2!

డైరెక్టర్ చందు మొండిటి దర్శకత్వంలో హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కార్తికేయ 2 సినిమాని తెరకెక్కించారు.

 Nikhil Siddharth Karthikeya-2 Rare Feat In Usa Details, Karthikeya 2,america,nik-TeluguStop.com

ఇక ఇందులో కలర్స్ స్వాతికి బదులు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.

ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నటువంటి ఈ సినిమా తాజాగా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా యూఎస్ఏ లో కూడా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ క్రమంలోనే అమెరికాలో ఈ సినిమా ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల వసూలు రాబట్టింది.

ఇది మాత్రమే కాకుండా అమెరికాలో విడుదలై నాలుగవ వారంలో కూడా ఏకంగా 80 కి పైగా లొకేషన్లలో ప్రదర్శితమైన మొట్టమొదటి తెలుగు సినిమాగా కార్తికేయ సినిమా రికార్డు సొంతం చేసుకుంది.ఇలా అమెరికాలో ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారిక ఖాతా ద్వారా తెలియజేశారు.ఇలా ఒక చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube