కరోనా వల్ల చాలామంది స్టార్ హీరోలు సినిమాలు అటకెక్కాయి.దాంట్లో యువ హీరో నిఖిల్ కూడా ఉన్నాడు 2019లో చివరిసారిగా అర్జున్ సురవరం సినిమాతో థియేటర్లలో కనిపించిన నిఖిల్ మూడేళ్ల సమయం కావస్తున్న మళ్ళీ ఏ సినిమాతోనూ రాకపోవడం విశేషం.కానీ ఇప్పుడు టాలీవుడ్ పై దండయాత్ర చేయడానికి వరుస నెలలో వరుస సినిమాలతో నిఖిల్ సిద్ధంగా ఉన్నాడు.
కార్తికేయ 2
గత ఎనిమిదేళ్ల క్రితం నిఖిల్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా కార్తికేయ గుర్తుందా ? ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా.ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.వాస్తవానికి ఈ సినిమా జూలైలోనే విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు మొదటి వారం లో రిలీజ్ ను జరుపుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
18 పేజేస్

ఇక సరిగ్గా మరొక నెల తర్వాత సెప్టెంబర్ 10వ తారీఖున పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన 18 పేజేస్ చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్రంలో కూడా అనుపమనే హీరోయిన్ కావడం మరొక విశేషం.
స్పై

ఇక ఇటీవల కాలంలో పాన్ ఇండియా జోరు పెరిగిన నేపథ్యంలో నిఖిల్ కూడా ఒక పానిడా సినిమాకి ఒకే చెప్పాడు దాని పేరు స్పై.ఇక ఈ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అక్టోబర్ లో దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల చేయడానికి చిత్ర యూనిట్ పూనుకుంది.ఇక ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ అనే వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇలా ఆగస్టు, అలాగే సెప్టెంబర్ మరియు అక్టోబర్ మూడు నెలల్లో మూడు సినిమాలతో థియేటర్లో సందడి చేయబోతున్నాడు యువ కథనాయకుడు నిఖిల్.ఈ మూడు సినిమాల్లో ఏ చిత్రం విజయవంతంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.







