మెగా డాటర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నిహారిక( Niharika Konidela ) ఒకరు.ఈమె యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు.
ఇకపోతే నిహారిక ప్రస్తుతం నిర్మాతగాను నటిగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే .అంతేకాకుండా వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు.ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న వారికి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.

మెగా హీరో అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలలో చురుగ్గా ఉంటున్నారు.అంతే కాకుండా ఈయన వెంట మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) కూడా రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నటువంటి తరుణంలో మెగా హీరోలకు తప్పనిసరిగా ఈ రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే బాబాయ్ పాలిటిక్స్ గురించి నిహారికకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
బాబాయ్ పొలిటికల్ యాక్టివిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.

ఈసారి పక్కాగా జనసేన పార్టీ ( Janasena Party ) విజయం సాధించాలని నేను దేవుడిని గట్టిగా ప్రార్థిస్తున్నానని తెలిపారు.ఇక నా ఓటు కూడా ఆంధ్రా( Andhra )లోనే ఉండేది కానీ ఇప్పుడు రద్దు అయింది కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదని తెలిపారు.ఇక ఆంధ్రాలో మేము ఒక ఇంటిని కూడా కొనుక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నాము నాన్న రాజకీయాలలో బిజీగా ఉండి ఇంటికి రావడమే పూర్తిగా మానేశారని ఏదో వచ్చిన అరగంట కూడా వెళ్లకుండా అలాగే వెళ్లిపోతారని అందుకే అక్కడే ఇల్లు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇక బాబాయ్ రాజకీయాలలోకి( Politics ) వెళ్లి ఎంతో కష్టపడుతున్నారని ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లకపోయినా తన చుట్టూ ఉండే వాళ్ళ క్షేమం కోరుకుంటారు అంటూ నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.