మెగా డాటర్ కి సిరీస్ అయినా కలిసి వచ్చిందా?

మెగా ఫ్యామిలీ( Mega Family ) నుండి సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఒక్కగానొక్క అమ్మాయి నిహారిక.నటిగా పలు సినిమాల్లో నటించిన నిహారిక కమర్షియల్ సక్సెస్ ని సొంతం చేసుకోవడం లో విఫలం అయింది.

 Niharika Re Entry With Web Series,niharika Konidela,dead Pixels,newsense Webseri-TeluguStop.com

కొన్ని సినిమాల తర్వాత నిహారిక( Niharika Konidela ) పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయింది.

నటన కు దూరం అయిన నిహారిక ప్రొడక్షన్ హౌస్ లో వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ప్రేక్షకులకు అందించింది.ఈ మధ్య నిహారిక భర్త నుండి దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఆ విషయం పై క్లారిటీ లేదు.

Telugu Nagababu, Newsense, Niharika, Tollywood-Movie

కానీ నటిగా మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ సారి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.డెడ్ పిక్సెల్స్( Dead Pixels ) అనే వెబ్ సిరీస్ తో యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు నిహారిక ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ సిరీస్ కి భారీగానే ప్రచారం చేశారు.

అయినా కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని టాక్‌ వినిపిస్తుంది.ఓటీటీలో ఈ సిరీస్ ని చూస్తున్న వారు చాలా తక్కువ మంది ఉన్నారని చర్చ జరుగుతుంది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవదీప్, బిందు మాధవి ల న్యూసెన్స్ వెబ్ సిరీస్( Newsense Web Series ) కి దక్కిన స్థాయిలో నిహారిక వెబ్ సిరీస్ కి స్పందన దక్కలేదు అంటూ టాక్ వినిపిస్తుంది.

Telugu Nagababu, Newsense, Niharika, Tollywood-Movie

మొత్తానికి అనూహ్యంగా నిహారిక నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది కానీ మొదటి ప్రయత్నం బెడిసి కొట్టింది.గతంలో సినిమాల్లో సక్సెస్ అవ్వలేక పోయిన నిహారిక సిరీస్ లో అయినా సక్సెస్ అవుతుందేమో అని ఆమె సన్నిహితులు భావించారు.కానీ సినిమాల్లో ఫలితమే సిరీస్ లో కూడా పునరావృతం అయింది.

పాపం నిహారిక సిరీస్ ల్లో కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.ఇక వ్యక్తిగత జీవితం గురించి కూడా ఈమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతానికి అంతా సవ్యంగా ఉందంటూ డెడ్ పిక్సల్స్ యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా నిహారిక మీడియాతో చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube