మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఒక మనసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.తెలుగుతో పాటు నిహారిక తమిళ చిత్రాల్లో కూడా నటిస్తూ వస్తుంది.
తెలుగులో రెండవ చిత్రానికి ఈమె చాలా గ్యాప్ తీసుకుంది.ఇన్నాళ్లకు నిహారిక రెండవ సినిమా పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది.
నిహారిక రెండవ సినిమాగా ‘హ్యాపీ వెడ్డింగ్’ తెరకెక్కింది.ఈ చిత్రంలో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు.
నిహారిక, అశ్విన్‌ల జంట చూడముచ్చటగా ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిహారిక మొదటి సినిమా సమయంలో ఆ సినిమాలో హీరోగా నటించిన నాగశౌర్యతో ప్రేమలో పడ్డట్లుగా ప్రచారం జరిగింది.
వీరిద్దరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోవడంతో పాటు, పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని, త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకుంటారు అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి.అయితే అప్పట్లోనే ఆ వార్తలపై నాగశౌర్య మరియు నిహారికలు క్లారిటీ ఇచ్చారు.
కొన్నాళ్ల వరకు ఆ ప్రచారం అలాగే సాగింది.ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ విషయాన్ని జనాలు మర్చి పోయారు.
ఇప్పుడు మళ్లీ మరో హీరోతో నిహారిక ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం జరుగుతుంది.

‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రంలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్‌తో నిహారిక చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుందని, సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఎక్కడికైనా కలిసి వెళ్తున్నారు అంటూ సమాచారం అందుతుంది.ప్రమోషన్స్ విషయంలో కూడా ఇద్దరు కలిసి వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం, కలిసి ఏదైనా షోలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు.ఆ కారణంగానే వీరిద్దరి మద్య ప్రేమ ఉందనే ప్రచారం మొదలైంది.
ఇద్దరికి సరైన జోడీ అని, అలాగే సుమంత్ అశ్విన్ మెగా ఫ్యామిలీలో కలిసి పోయే వ్యక్తిగా ఉంటాడు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఈ విషయమై మెగా ఫ్యామిలీ నుండి కాని, సుమంత్ సైడ్ నుండి కాని క్లారిటీ రావాల్సి ఉంది.
సుమంత్ అశ్విన్‌తో నిజంగానే నిహారిక ప్రేమలో ఉందా లేదంటే మీడియాలో పుట్టిన పుకారా అనేది ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌ను తొలుస్తున్న ప్రశ్న.ఒకవేళ ఇదే నిజం అయితే సుమంత్ అశ్విన్ లక్కీ అంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
మరి కొందరు మాత్రం నిహారిక స్థాయికి సుమంత్ అశ్విన్ తగిన వ్యక్తి కాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలా మొత్తంగా ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు.







