మెగా డాటర్ నిహారిక గురించి అందరికీ తెలిసిందే ఈమె అల్లరి చేష్టలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి.నాగబాబుకు ముద్దుల కూతురుగా నిహారికను ఎప్పుడూ ఎంతో గారాభం చేస్తూ ఉంటారు.
తనకు పెళ్లి అయినప్పటికీ తనని ఇంకా చిన్న పిల్లలాగే ట్రీట్ చేస్తుంటారు.ఇలా నిహారిక ఎక్కడ ఉన్నా అక్కడ అల్లరి పనులు చిలిపి పనులు చేస్తూ అందరిని సందడి చేస్తుంటారు.
అయితే ఉన్నఫలంగా నిహారిక డాక్టర్ గా మారిపోయారు అంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా తన కూతురి అల్లరి పనులకు సంబంధించిన విషయాన్ని వెల్లడించారు.
గత కొద్దిరోజులుగా నాగబాబు కుడి చేతికి గాయం కావడంతో చేయి కదపకుండా బెల్ట్ ధరించి కనిపిస్తున్నారు.
హారిక తన తండ్రి వద్దకు వెళ్లి నొప్పి తగ్గిందా అంటూ ప్రేమగా పలకరించడమే కాకుండా నేను నీ నొప్పిని చిటికెలో తగ్గిస్తా డాడీ అంటూ మరో చెయ్యిని పట్టుకుని గట్టిగా కొరికారు.ఇలా నిహారిక ఒక్కసారిగా కొరకడంతో నాగబాబు గట్టిగా అరిచారు.
చూసావా డాడీ నొప్పి తగ్గింది అంటే మరో చేతికి నొప్పి వచ్చింది కదా అమ్మ అంటూ తన తండ్రి తెలియచేశారు.అయితే ఇదే విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు పోస్ట్ చేస్తూ.ముల్లుని ముల్లుతో తీయడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్ చేశారు.ఎవరు కూడా దీనిని మీ ఇంట్లో ట్రై చేయొద్దు ఇది కేవలం డాక్టర్ నిహారిక పర్యవేక్షణలో మాత్రమే జరిగింది అంటూ నాగబాబు ఫన్నీ కామెంట్ చేశారు.మొత్తానికి తండ్రి కూతుర్ల ఇద్దరి మధ్య ఉన్న ఈ ప్రేమను చూసిన నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక నిహారిక వివాహమైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా మారారు.ఇలా ఈమె పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.