Niharika : మొదటిసారి పబ్ కేసు గురించి స్పందించిన నిహారిక.. ఆలస్యంగా తెలిసిందంటూ?

మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కెరియర్ పై ఫోకస్ చేశారు.

 Niharika First Time Responded On Pub Issue-TeluguStop.com

దీంతో నిర్మాతగాను నటిగాను కొనసాగుతూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఉన్నటువంటి నిహారిక మొదటిసారి రాడిసన్ పబ్ ( Radison Pub ) అరెస్టు గురించి స్పందించారు.

ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ కి వెళ్లగా అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ పోలీసులకు సమాచారం రావడంతో అందరిని కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Divorce, Drugs, Niharika, Pub, Tollywood-Movie

ఆ సమయంలో నిహారిక కూడా అక్కడ ఉండడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది.ఇలా ఈమె పబ్ లో అరెస్ట్ కావడంతో తన భర్తతో మనస్పర్ధలు వచ్చాయని అందుకే విడాకులు ( Divorce ) కూడా తీసుకుంది అంటూ వార్తలు వినిపించాయి.ఇకపోతే మొదటిసారి ఈ పబ్ ఘటన గురించి నిహారిక స్పందించారు.

అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారంటూ ఈమె మండిపడ్డారు.నేను మామూలుగానే పబ్ కు వెళ్ళను అది నా ఫ్రెండ్స్ కి కూడా తెలుసు.

Telugu Divorce, Drugs, Niharika, Pub, Tollywood-Movie

ఆరోజు నేను తన స్కూల్ ఫ్రెండ్స్ ని కలవడం కోసం అక్కడికి వెళ్లాను.చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలవడంతో పార్టీ చేసుకోవడం కోసమే అక్కడికి వెళ్లానని ఈమె తెలిపారు.ఇక మేము కాసేపు మాట్లాడుకుని ఇక బిల్లు కట్టి బయటకు వచ్చేలోపు పోలీసులు రైడ్ చేశారని నిహారిక తెలిపారు.దీంతో అందరితో పాటు మమ్మల్ని కూడా స్టేషన్ కి తీసుకువెళ్లారని ఇక మీడియాకు ఈ విషయం తెలిసి రచ్చ రచ్చ చేసి ఏవేవో వార్తలు రాశారు.

అసలు నా తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు అని చాలా బాధ వేసింది.అయితే చాలాసేపటికి నాకు అర్థమైంది .అక్కడ కొంతమంది డ్రగ్స్ ( Drugs ) తీసుకుంటున్నారని అందుకే పోలీసులు అరెస్టు చేశారని అర్థమైంది.నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా నిహారిక ఘటన గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube