పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఈ మేరకు తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టును ప్రకటించింది.
ఎన్ఏఐ ప్రకటించిన లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారని తెలుస్తోంది.వీరిలో తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ అహద్ తో పాటు ఏపీలోని నెల్లూరు జిల్లా ఖాజానగర్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ఉన్నారు.
అలాగే కేరళలో పదకొండు మంది, కర్ణాటకలో ఐదుగురు, తమిళనాడులో మరో ఐదుగురు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు.వీరి సమాచారం తెలిస్తే 9497715294 నంబర్ కు తెలియజేయాలని ఎన్ఏఐ అధికారులు ప్రకటించారు.
ఈ క్రమంలోనే నిందితుల ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని తెలిపారు.కాగా ఈ కేసులో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.