Coca-Cola : పాత పద్ధతిలో కోకాకోలా సర్వ్ చేస్తోన్న న్యూయార్క్ రెస్టారెంట్.. వీడియో వైరల్..

కోకాకోలా( Coca-Cola ) అనేది చాలా ఓల్డ్ డ్రింక్, దీని తయారీ విధానం, సర్వ్‌ చేసే పద్ధతి కాలక్రమేణా మారిపోయింది.అందువల్ల ఒకప్పుడు దీన్ని ఎలా తయారు చేసి సర్వ్ చేశారో చాలా మందికి తెలియదు.

 Newyork Diner Serves Coca Cola The Old Fashioned Way-TeluguStop.com

నిజానికి ఒకప్పుడు చాలా గొప్పగా దీనిని తయారు చేసి సర్వ్ చేసేవారు.ఇప్పుడు చాలా ప్రదేశాలలో ఈ పాత పద్ధతిని( Old Method ) పాటించడం లేదు.

కానీ న్యూయార్క్‌( New York )లోని ఒక రెస్టారెంట్‌లో ఇప్పటికీ ఇదే మెథడ్ ఫాలో అవుతున్నారు.ఈ రెస్టారెంట్ పేరు లెక్సింగ్టన్ క్యాండీ షాప్.

ఇది స్థాపించి దాదాపు 95 ఏళ్లు గడిచిపోతోంది.ఈ డైనర్‌లోని ఓ ఉద్యోగి కోకాకోలాను ఓల్డ్ మెథడ్‌లో తయారు చేస్తున్న వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

ఇది ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది.ఈ వీడియోను మొదట @Newyorknico అనే వ్యక్తి షేర్ చేసారు, దీనికి 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

డైనర్ వద్ద ఉన్న వ్యక్తి పాత పద్ధతిలో డ్రింక్ తయారు చేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.అతను కోకాకోలాను సీసా నుంచి లేదా బాటిల్ నుంచి పోయలేదు.కోకాకోలా, సోడా వాటర్ ఉన్న కొన్ని మెషిన్లను ప్రెస్ చేసి డ్రింక్ పోశాడు.వాటిని ఒకదానితో ఒకటి కలిపి బాగా షేక్ చేశాడు.డ్రింక్‌లో వెనీలా ఐస్‌క్రీమ్‌ను( Vanilla Ice Cream ) కూడా యాడ్ చేసి కస్టమర్‌కు ఇచ్చాడు.ఈ రెస్టారెంట్ 1925 నుంచి ఒకే స్థలంలో ఉంది.

ఇది న్యూయార్క్ నగరంలో లెక్సింగ్టన్ అవెన్యూ, 83వ వీధి మూలలో ఉంది.ఇక్కడ పాతకాలం నాటి అమెరికన్ ఫుడ్( American Food ) దొరుకుతుంది.

సంగీతం, ఆటలను ప్లే చేసే యంత్రాలతో కస్టమర్లను పాత కాలంలోకి తీసుకెళ్తుంది.

నికోలస్ హెల్లర్( Nicolas Heller ) అనే మరో వ్యక్తి కూడా 2022లో ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ వీడియోను పోస్ట్ చేశాడు.లెక్సింగ్టన్ క్యాండీ షాప్ 97 ఏళ్ల నాటి ప్రదేశం అని, అది ఇప్పటికీ తమ కోక్‌ను పాత పద్ధతిలోనే సర్వ్ చేస్తుందని చెప్పాడు.రెస్టారెంట్ చిరునామా 1226 లెక్సింగ్టన్ అవెన్యూ.

ఇది పెద్ద మ్యూజియంకు సమీపంలోనే ఉంటుంది.లోపలికి వెళితే 1940లలో ఉన్నట్టు అనిపిస్తుంది.

లెక్సింగ్టన్ క్యాండీ షాప్( Lexington Candy Shop ) NYCలో తినడానికి చక్కని ప్రదేశాలలో ఒకటి.వీడియో చూసిన చాలా మంది అక్కడ కోకాకోలాను ఎలా తయారు చేస్తారో చూసి ఆశ్చర్యపోయారు.

ఈ పాత పద్ధతి చాలా బాగుందని వారు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube