షారుక్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న కొత్త పెళ్లి కూతురు!

నయనతార విగ్నేష్ శివన్ ఈనెల 9వ తేదీ మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

 Newlyweds Nayanthara In Shah Rukh Khan Movie Shooting , Nayantara , Tollywood ,-TeluguStop.com

వివాహమైన తర్వాత వీరిద్దరూ థాయిలాండ్ హనీమూన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ జంట హనీమూన్ వెకేషన్ ని పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా హనీమూన్ వెకేషన్ పూర్తి కాగానే ఈ జంట తిరిగి వారి పనులలో నిమగ్నమయ్యారు.

ఈమె తమిళం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు.ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా సందడి చేయనున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఈమె హనీమూన్ నుంచి రాగానే ముంబైకి వెళ్లి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Telugu Jawan, Nayantara, Shah Rukh Khan, Tollywood-Movie

నయనతార వివాహం తర్వాత సినిమాలు చేయదు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇక ఒకవేళ సినిమాలు చేసిన ఈమె కండిషన్లకు ఒప్పుకుంటేనే సినిమాలలో నటిస్తుంది అంటూ ఇన్ని రోజులు వార్తలు షికార్లు చేశాయి.అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదనీ తెలుస్తోంది.

ఇక వీరి హనీమూన్ వెకేషన్ పూర్తి కాగానే హఠాత్తుగా షూటింగ్‌ సెట్‌లో ప్రత్యక్షం కావడం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.ఇకపోతే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube