అరుదైన శివుని విగ్రహాన్ని చోరీ చేసిన భారత సంతతి స్మగ్లర్ .. కంబోడియాకు తిరిగి పంపిన అమెరికా

30 దొంగిలించబడిన పురాతన వస్తువులు, కళాఖండాలను కంబోడియా, ఇండోనేషియా దేశాలకు న్యూయార్క్ అధికారులు విజయవంతంగా పంపించారు.

వీటి విలువ దాదాపు 3 మిలియన్ డాలర్లపైనే వుంటుందని అంచనా.

ఈ పురాతన కళాఖండాలు.అమెరికన్ డీలర్లు, ట్రాఫికర్ల ద్వారా చేతులు మారాయని అధికారులు తెలిపారు.

మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ (Manhattan District Attorney Alvin Bragg)ఈ సాంస్కృతిక సంపదను తిరిగి ఇస్తున్నట్లుగా ప్రకటించారు.తాము ఆగ్నేయాసియా పురాతన వస్తువులను లక్ష్యంగా చేసుకునే విస్తృత శ్రేణి ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను పరిశోధించడం కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇప్పటికే ఈ దిశగా గణనీయమైన పురోగతిని సాధించామని.అనేక ప్రముఖ నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేశామని బ్రాగ్ చెప్పారు.

Advertisement

దీనిపై ఇంకా స్పష్టంగా పనిచేయాల్సి వుందని ఆయన అంగీకరించారు.

న్యూయార్క్ నుంచి తిరిగి పంపిన కళాఖండాల్లో కంబోడియా(Cambodia) రాజధాని నమ్ పెన్‌కు 17, ఇండోనేషియా( Indonesia) రాజధాని జకార్తాకు 3 వున్నాయి.వీటిలో శివత్రయం అని పిలిచే హిందూ దేవుడైన శివుని కాంస్య విగ్రహం(Bronze statue of Lord Shiva) ఒకటి.దీనిని కంబోడియా నుంచి అక్రమంగా సరిహద్దులు దాటించారు.

అలాగే క్రీ.శ 13 , 16 శతాబ్ధాల నాటి మజాపహిత్ సామ్రాజ్యానికి చెందిన రెండు రాచరికపు బొమ్మలను వర్ణించే బొమ్మలను ఇండోనేషియా నుంచి దొంగిలించారు.

ఈ పరిణామంపై కంబోడియా రాయల్ అంబాసిడర్ కియో ఛెయా మాట్లాడుతూ.ఇది పొగొట్టుకున్న సంపదను తిరిగి ఇవ్వడం మాత్రమే కాదన్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

వారసత్వ ఆత్మను రక్షించడానికి దేశాల మధ్య నిబద్ధతను పునరుద్ధరించడమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

ఇండో అమెరికన్ స్మగ్లర్ సుభాష్ కపూర్, అమెరికన్ డీలర్ నాన్సీ వీనర్‌లు ఈ వస్తువుల అక్రమ రవాణా వెనుక సూత్రధారులుగా అధికారులు తెలిపారు.‘‘హిడెన్ ఐడల్ ’’ అనే ఆపరేషన్‌లో భాగంగా దాదాపు దశాబ్ధకాలంగా అమెరికా న్యాయాధికారుల విచారణలో వున్న సుభాష్ కపూర్ 2011లో అరెస్ట్ అయ్యాడు.అతనిని భారతదేశానికి తీసుకురాగా.

అక్కడా విచారణను ఎదుర్కొన్నాడు.నవంబర్ 2022లో సుభాష్‌కు 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్ట్.

తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తిరస్కరించినప్పటికీ .పురాతన వస్తువుల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై విస్తృత దర్యాప్తు జరుగుతోంది.

తాజా వార్తలు