సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం.. మూడు మిస్డ్ కాల్స్ తో ఖాతా ఖాళీ..!

భారతదేశంలో ప్రభుత్వం మరియు సైబర్ పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తం చేసిన ఆన్లైన్ మోసాలు( Online fraud ) మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త దారులను వెతుక్కుంటున్నారు.

 New Type Of Fraud By Cyber Criminals Account Empty With Three Missed Calls, Onl-TeluguStop.com

ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది.కేవలం మొబైల్ ఫోన్ కు మూడుసార్లు మిస్డ్ కాల్ చేసి ఖాతా ఖాళీ చేసేస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్ లన్నీ అందులో వాడే మొబైల్ నంబర్ కు కనెక్ట్ అయి ఉంటాయి.సిమ్ కార్డును హ్యాక్ చేస్తే స్మార్ట్ ఫోన్ ను హ్యక్ చేసినట్టే.

ఇక సులువుగా ఖాతాలోకి ప్రవేశించి డబ్బులు కాజేసేందుకు వీలుంటుంది.స్విమ్ స్వాప్ ఫీచర్( SIM Swap ) తో మిస్డ్ కాల్ ఇచ్చి ఖాతాలు ఖాళీ చేస్తుండడంతో బ్యాంకులు కూడా షాక్ అవుతున్నాయి.

ఢిల్లీ( Delhi )కి చెందిన ఓ 35 ఏళ్ల మహిళ లాయర్ ఫోన్ కు మూడుసార్లు మిస్డ్ కాల్ వచ్చింది.ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే ఆమె ఖాతా మొత్తం ఖాళీ అయింది.ఆమె అధికారులకు ఫిర్యాదు చెయ్యగా ఆమె వాడుతున్న మొబైల్ ఫోన్ సిమ్ స్వాప్ అయినట్లు తెలిసింది.ఆమె ఎవరికి ఓటిపి లేదా వ్యక్తిగత వివరాలను వెల్లడించలేదు.ఒకే నెంబర్ నుంచి మూడుసార్లు మిస్డ్ కాల్స్ వచ్చిన కాసేపటికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు డెబిట్ అయినట్లు వరుసగా మెసేజ్లు వచ్చాయి.ఆమె తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేస్తే అది కొరియర్ డెలివరీ కోసం అని ఆమెకు సమాచారం వచ్చింది.

ఆమెకు సిమ్ స్వాప్ కు ఎలా గురైందంటే.ఓ కొరియర్ కోసం ఆమె నిందితుడికి తన అడ్రస్ ఇచ్చింది.ఆ తర్వాత దీన్ని తన మొబైల్ నెంబర్ కు లింక్ చేసి ఓ ఫేక్ సిమ్ తయారు చేసి దాన్ని ఒరిజినల్ తో స్వాప్ చేయడానికి మిస్డ్ కాల్ ఇచ్చినట్లు తేలింది.తర్వాత ఆమె ఫోన్ కు ఫిషింగ్ లింక్స్, ఇతర మెసేజ్లు వచ్చాయి.

ఆమెకు తెలియకుండానే బ్రౌజింగ్ హిస్టరీలో పలు అంశాలు వీక్షించినట్లు ఉందని తేలింది.అంటే ఆమె సిమ్ స్వాప్ చేయడం ద్వారా ఆమె ఫోన్ లోకి వెళ్లి అప్పటికే పంపిన లింక్స్ ను క్లిక్ చేసి ఈ డబ్బులు కొట్టేసినట్లు తెలిసింది.

కాబట్టి చిరునామా లేదా ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లాంటి వ్యక్తిగత వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

Account Hacking through Missed Calls

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube