ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్..!!

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది.రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.

 New Twist In Mlc Elections In Mla Quota..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే ఒక్కో స్థానానికి విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.దీనిపై ఇప్పటికే సీఈసీని అసెంబ్లీ సెక్రటరీ వివరణ కోరగా.

వేర్వేరుగానే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.ఈ విధంగా నోటిఫికేషన్ విడివిడిగా వస్తే ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లనున్నాయని తెలుస్తోంది.

దీంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్ నెలకొంది.ఈసీ నిర్ణయం కారణంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తోందని తెలుస్తోంది.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉంది.ఈ కారణంగా కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ యోచనలో ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube