ఇండియా నుంచి యూఏఈకి కొత్త రూట్స్‌.. రూ.4 వేలలోపే టికెట్ ధరలు..

సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ నుంచి ఇండియాకి ఫ్లైట్‌ టికెట్ కోసం పదివేల కంటే ఎక్కువే వెచ్చించాల్సి వస్తోంది.అయితే త్వరలో ఈ ధర భారీగా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 New Routes From India To Uae.. Ticket Prices Under Rs. 4 Thousand.. Wizz Air Ab-TeluguStop.com

ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ విజ్ ఎయిర్ అబుదాబి( Wizz Air Abu Dhabi ) ఇండియాలో తన సేవలను లాంచ్ చేయాలని చర్చలు జరుపుతోంది.ఎయిర్‌లైన్ ప్రస్తుతం రెగ్యులేటరీ ప్రాసెస్ పూర్తి చేసే పనిలో ఉందని తెలుస్తోంది.

ఈ ప్రాసెస్ పూర్తి చేసిన వెంటనే భారతదేశానికి తన విమానాల కోసం మార్గాలను ప్రకటించాలని భావిస్తోంది.

Telugu Budget Airline, Dubai, India Uae, Indian, Johan Eidhagen, Cost Flights-La

ఈ నేపథ్యంలోనే విజ్ ఎయిర్ అబుదాబి మేనేజింగ్ డైరెక్టర్ జోహన్ ఈధాగెన్( Johan Eidhagen ) సరసమైన టికెట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాయితీతో కూడిన విమాన ఛార్జీలను భారత మార్కెట్లో అందించే అవకాశం ఉందని అతను సంతోషం వ్యక్తం చేశారు.ప్రస్తుతం యూఏఈలో అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లను ఇండియాలో కూడా ఈ విమానయాన సంస్థ అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సాధారణంగా ఈ కంపెనీ ఎప్పుడూ కూడా సరసమైన ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తుంటుంది.ఈ సంస్థ యూఏఈలో ప్రయాణానికి టిక్కెట్లను 179 దిర్హామ్‌లు (దాదాపు రూ.4,000) కంటే తక్కువకు విక్రయిస్తుంది.

Telugu Budget Airline, Dubai, India Uae, Indian, Johan Eidhagen, Cost Flights-La

భారతదేశం( India ) నుంచి కూడా టికెట్ల ధరను అంతే స్థాయిలో నిర్ణయించవచ్చని తెలుస్తోంది.ఇక 2022లో, Wizz Air Abu Dhabi 12 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లింది.2023 నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పైగా పెంచాలని ఎయిర్‌లైన్ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రస్తుతం, ఎయిర్‌లైన్ ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు అబుదాబికి విమానాలను నడుపుతోంది, అయితే దీనిని డైలీ సర్వీస్ గా మార్చాలని యోచిస్తోంది.

Telugu Budget Airline, Dubai, India Uae, Indian, Johan Eidhagen, Cost Flights-La

భారతదేశం-యూఏఈ( UAE ) మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మార్గాలలో విమానాలను అందుబాటులోకి తెస్తే సంస్థలకు లాభాలు ఉంటాయి.ఇక బడ్జెట్ ధరల్లో టికెట్ తీసుకొస్తే ప్రయాణికులపై భారం చాలా తగ్గుతుంది.ఈ కొత్త సంస్థ నుంచి అధికారిక టికెట్ల ధరలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube