ఇండియా నుంచి యూఏఈకి కొత్త రూట్స్.. రూ.4 వేలలోపే టికెట్ ధరలు..
TeluguStop.com
సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇండియాకి ఫ్లైట్ టికెట్ కోసం పదివేల కంటే ఎక్కువే వెచ్చించాల్సి వస్తోంది.
అయితే త్వరలో ఈ ధర భారీగా తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ విజ్ ఎయిర్ అబుదాబి( Wizz Air Abu Dhabi ) ఇండియాలో తన సేవలను లాంచ్ చేయాలని చర్చలు జరుపుతోంది.
ఎయిర్‌లైన్ ప్రస్తుతం రెగ్యులేటరీ ప్రాసెస్ పూర్తి చేసే పనిలో ఉందని తెలుస్తోంది.ఈ ప్రాసెస్ పూర్తి చేసిన వెంటనే భారతదేశానికి తన విమానాల కోసం మార్గాలను ప్రకటించాలని భావిస్తోంది.
"""/" /
ఈ నేపథ్యంలోనే విజ్ ఎయిర్ అబుదాబి మేనేజింగ్ డైరెక్టర్ జోహన్ ఈధాగెన్( Johan Eidhagen ) సరసమైన టికెట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాయితీతో కూడిన విమాన ఛార్జీలను భారత మార్కెట్లో అందించే అవకాశం ఉందని అతను సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం యూఏఈలో అందిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లను ఇండియాలో కూడా ఈ విమానయాన సంస్థ అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సాధారణంగా ఈ కంపెనీ ఎప్పుడూ కూడా సరసమైన ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తుంటుంది.
ఈ సంస్థ యూఏఈలో ప్రయాణానికి టిక్కెట్లను 179 దిర్హామ్‌లు (దాదాపు రూ.4,000) కంటే తక్కువకు విక్రయిస్తుంది.
"""/" /
భారతదేశం( India ) నుంచి కూడా టికెట్ల ధరను అంతే స్థాయిలో నిర్ణయించవచ్చని తెలుస్తోంది.
ఇక 2022లో, Wizz Air Abu Dhabi 12 లక్షల మంది ప్రయాణికులను తీసుకువెళ్లింది.
2023 నాటికి ఈ సంఖ్యను 20 లక్షలకు పైగా పెంచాలని ఎయిర్‌లైన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం, ఎయిర్‌లైన్ ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు అబుదాబికి విమానాలను నడుపుతోంది, అయితే దీనిని డైలీ సర్వీస్ గా మార్చాలని యోచిస్తోంది.
"""/" /
భారతదేశం-యూఏఈ( UAE ) మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ మార్గాలలో విమానాలను అందుబాటులోకి తెస్తే సంస్థలకు లాభాలు ఉంటాయి.
ఇక బడ్జెట్ ధరల్లో టికెట్ తీసుకొస్తే ప్రయాణికులపై భారం చాలా తగ్గుతుంది.ఈ కొత్త సంస్థ నుంచి అధికారిక టికెట్ల ధరలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ ఫేస్ ఆయిల్ తో సూపర్ గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ మీ సొంతం!