బెంగుళూరులో ఆటో డ్రైవర్ నయా మోసం.. యూట్యూబర్ వీడియో వైరల్..!

బెంగళూరు( Bengaluru )లో ఆటోలో ప్రయాణించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గురించి తెలిస్తే అర్థమవుతుంది.సాధారణంగా కొంతమంది ఆటో డ్రైవర్లు సిటీకి కొత్తగా వచ్చినవారి దగ్గర, రూట్ తెలియనివారి దగ్గర కాస్త దూరానికే వందల రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు.

 New Fraud Of Auto Driver In Bangalore Youtuber Video Viral , Youtube , Video-TeluguStop.com

బెంగళూరు నగరంలో ఓ ఆటో డ్రైవర్ చేసిన ఘనకార్యం సోషల్ మీడియా( Social media ) వేదికగా తెగ వైరల్ అయింది అదేమిటో చూద్దాం.బంగ్లాదేశ్ కు చెందిన ఎండీ ఫిజ్ అనే వ్యక్తి ఫిజ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు.

ఇటీవలే అతను కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి వచ్చాడు.బెంగళూరులో ఓ ఆటో ఎక్కి తాను దిగాల్సిన ప్లేస్ వచ్చిన తర్వాత ఆ ఆటో డ్రైవర్( Auto drive ) కు రూ.500 ఇచ్చాడు.అయితే ఆ ఆటో డ్రైవర్ మీరు రూ.100 ఇచ్చారు.కానీ మీ చార్జ్ రూ.300 అయ్యింది.మీరు మరో రూ.200 ఇవ్వాలని చెప్పాడు.

దీంతో ఫిజ్ తాను పొరపాటు పడ్డానేమో అని భావించి రూ.100 తీసుకొని రూ.500 ఇచ్చాడు.ఆ ఆటో డ్రైవర్ చిల్లర ఇవ్వబోతుండగా ఉంచుకో అని చెప్పి ఫిజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఆటో డ్రైవర్ చేసిన మోసం ఫిజ్ అప్పుడు గుర్తించలేకపోయాడు.కానీ అప్పటికే తాను తీస్తున్న వీడియోలో ఆటో డ్రైవర్ చేసిన మోసం అంతా స్పష్టంగా రికార్డు అయింది.

ఫిజ్ తన రైడ్ ను యూట్యూబ్( Youtube ) లో అప్లోడ్ చేసే క్రమంలో ఆటో డ్రైవర్ చేసిన మోసాన్ని గుర్తించాడు.అనంతరం ఆ వీడియోను పోస్ట్ చేస్తూ బెంగళూరులో ఈ డ్రైవర్ ఆటోను ఎక్కవొద్దు అంటూ చెప్పుకొచ్చాడు ఆ వీడియోలో.ఆ వీడియోలో ముందు ఫిజ్ రూ.500 ఇస్తే.క్షణాల్లోనే ఆటో డ్రైవర్ తన షర్ట్ చేతి మడతల్లో దాచేసి అప్పటికే చేతిలో రెడీగా పెట్టుకున్న రూ.100 నోటు చూపించి మరో రూ.200 ఇవ్వాలని అడిగినట్లు కనిపిస్తోంది.ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.ఫిజ్ తన రైడ్ మొత్తాన్ని వీడియో తీస్తున్న విషయం తెలిసి కూడా ఆ ఆటో డ్రైవర్ మోసం చేశాడు.ఈ వీడియో చూసిన వారంతా బెంగుళూరులో ఆటోలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

https://youtu.be/5YLCgo4Zhhc
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube