ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఫేస్ బుక్( Facebook ) సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సప్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ తో పోటీ పడుతూనే ఉంది.తాజాగా ఫేస్ బుక్ యూజర్లు లాగౌట్ చేయకుండానే మల్టిపుల్ పర్సనల్ ప్రొఫైల్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
అందుకోసం సింపుల్ గా స్విచ్ చేయడానికి ఒక కొత్త అప్డేట్ ను తీసుకువచ్చింది.యూజర్లు వేర్వేరు అవసరాల కోసం వేరుగా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
అంటే కుటుంబ సభ్యుల కోసం, ఫ్రెండ్స్ కోసం, ఇతర అభిరుచుల కోసం విభిన్న ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
ఫేస్ బుక్ యూజర్లు మల్టిపుల్ ప్రొఫైల్స్( Multiple profiles ) ను ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం.ఫేస్ బుక్ యూజర్లు ముందుగా కొత్త ప్రొఫైల్ ని క్రియేట్ చేయడానికి, యూజర్ యాప్( User App ) లేదా వెబ్ వెర్షన్ లో ప్రొఫైల్ పేరు పై నొక్కి, క్రియేట్ అనదర్ ప్రొఫైల్ ఆన్ ఫేస్బుక్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి.కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేయడం కోసం వేరోక యూజర్ నేమ్ తో పాటు ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి.
కొత్త ప్రొఫైల్ ను ఉపయోగించి ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నా ఫ్రెండ్స్, గ్రూప్స్ యాడ్( Add friends, groups ) చేసుకోవచ్చు.ఇక ప్రొఫైల్స్ మధ్య స్విచ్ కావడానికి వెబ్ వర్షన్ కి దిగువన కుడివైపున ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.అంతే మీరు ఎలాంటి ప్రొఫైల్ ఉపయోగించాలి అనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ ను ఎంచుకోవచ్చు.ఫేస్ బుక్ యూజర్లు గరిష్టంగా ఐదు ప్రొఫైల్స్ ను కలిగి ఉండవచ్చు.కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించాల్సి ఉంటుంది.డేటింగ్, మార్కెట్ ప్లేస్, పేమెంట్స్, ప్రొఫెషనల్ మోడ్ లాంటి వాటి కోసం మల్టిపుల్ ప్రొఫైల్స్ ను ఉపయోగించలేరు.
ఈ ఫీచర్లు కేవలం మెయిన్ ప్రొఫైల్ కు మాత్రమే అందుబాటులో ఉంటాయి.