హీరో కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. దీని ఫీచర్లు ఇవే..

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో హీరో పేరు మీద చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ లాంచ్ అయ్యాయి.అయితే అవన్నీ కూడా హీరో మోటోకార్ప్‌కి చెందినవి కావు.

 New Electric Scooter Launch From Hero Company Its Features Are These-TeluguStop.com

కాగా ఇప్పుడు హీరో మోటోకార్ప్‌ ఇండియాలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.అక్టోబర్ 7న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను హీరో విడా పేరుతో తీసుకొస్తోంది.

దీనిని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.అంటే ఇందులో స్వాపబుల్ బ్యాటరీ ఇచ్చారని అర్థమవుతోంది.

కంపెనీ ప్రకారం ఈ స్కూటర్‌ను ఇంట్లో, పార్కింగ్ ప్రదేశాల్లో, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్ చేసుకోవచ్చు.

హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్లలో స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని అందించేందుకు తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీతో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది.

అలాగే ఏథర్ ఎనర్జీతో కూడా హీరో మోటో కార్ప్‌ పార్ట్‌నర్‌షిప్ పెట్టుకుంది.ఏథర్ ఛార్జింగ్ సదుపాయాలను తన కస్టమర్లకు అందించేందుకే కంపెనీ ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది.దీని ధర రూ.80 వేల వరకు ఉండొచ్చని అంచనా.హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.అలానే లాంచ్ తేదీని కూడా ప్రకటించింది.కానీ ఫీచర్ల గురించి పూర్తిస్థాయిలో వెల్లడించలేదు.అయినా కూడా ఆటోమొబైల్ నిపుణులు దీని ఫీచర్ల గురించి కొన్ని వివరాలు అందించారు.

అవేంటో తెలుసుకుందాం.

హీరో విడా ఈ-స్కూటర్ సింగిల్-పీస్ సెటప్‌కు బదులుగా స్ప్లిట్ సీట్‌లతో వస్తుంది.ఇందులోని రెండు అండర్‌సీట్ కంపార్ట్‌మెంట్స్‌ ఉంటాయి.ఒక దానిలో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, మరొక దానిలో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.

ఈ స్కూటర్‌లో స్పోర్టి అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్‌, బ్రేకింగ్‌ కోసం ఫ్రంట్ బ్యాక్ డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.ఇది హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్‌లకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube