వీడియో వైరల్: ఒరేయ్ బుడ్డోడా.. నువ్వు మాములోడివి కాదురా..!

చిన్నపిల్లలు( Child ) అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.బుజ్జి బుజ్జి మాటలు చెబుతూ.

 New Born Baby Caught Surgical Scissors Video Viral,surgical Scissors,social Medi-TeluguStop.com

చిన్నచిన్న చేతులు.కాళ్లతో.

ముట్టుకుంటే కందిపోయేలా సుకుమారంగా ఉండే పిల్లలను ఆడించుకోవడం అంటే ప్రతి ఒక్కరికి ఓ సరదా.అయితే ఒక్కోసారి పిల్లలు ఇంట్లో చేసే అల్లరికి కూడా చిరాకు రావడం సహజమే.

ఇంట్లోనే వస్తువులు ఎన్నిసార్లు సర్దుకున్న పిల్లలు వాటిని ఎలా పడితే అలా ఇంటి నిండా పడేయడం వల్ల ఒక్కోసారి వారిపై కోపం కూడా వస్తుంటుంది.ఇకపోతే అప్పుడే పుట్టిన పిల్లలను చూడడానికి మనం ఎంతగానో ఇష్టపడతాం.

వారు చూడడానికి చిన్న చిన్న.లేలేత కాళ్లు చేతులు, అలాగే పింక్ గులాబిలాల, మెరిసిపోయే కళ్ళతో ఉంటూ ముద్దుగా ఉంటారు.

అలా వారు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక ‘ఒరేయ్ ఎవర్రా మీరంతా.నేను ఏ లోకంలోకి వచ్చాను’ అంటూ అందరిని చూస్తూ ఉంటూ ఉండడం మనం గమనించే ఉంటాము.ఇకపోతే అలా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన కొందరు పిల్లలు ఆపరేషన్ థియేటర్లో( Operation Theater ) ఉన్న డాక్టర్ లేదా నర్సుల డ్రస్సులను గట్టిగా పట్టేసుకుని వదలకుండా ఉండడం సంబంధించిన వీడియోలు కూడా ఇదివరకు మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం.మరి కొందరు పిల్లలు తన తల్లి స్పర్శ( Mother Touch ) తగలగానే అప్పటివరకు పెద్దగా ఏడుస్తున్న వారు కామ్ గా తల్లి వద్ద పడుకుంటారు.

ఇకపోతే ఇలాంటి ఘటనలో మరొక వీడియో కూడా వైరల్ గా మారింది.సంబంధించి వివరాలు చూస్తే.

అప్పుడే పుట్టిన శిశువు( New Born Baby ) ఆసుపత్రి బెడ్ మీద ఉన్న కత్తెరను గట్టిగా పట్టుకొని వదలనే వదలకుండా ఉన్నాడు.ఆ పిల్లాడికి బొడ్డుతాడు కోసిన తర్వాత కత్తెరను సిబ్బంది ఆ పిల్లాడి చేతిలో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించిన దానిని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.ఈ వీడియోని ఇప్పటిదాకా మూడు కోట్ల మంది చూశారంటే అర్థం చేసుకోండి ఈ వీడియో ఎంత వైరల్ గా మారిందో.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube