ప్రముఖ ఆభరణాల విక్రయాల సంస్థ తనిష్క్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏకత్వం కోసం ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం రూపొంచిన ప్రకటనే దీనికి కారణం.
ఇందులో తమ ఇంటికి హిందూ కోడలిని ఆహ్వానించిన ముస్లిం కుటుంబం ఆ అమ్మాయికి సీమంతం చేయడానికి సిద్ధమవుతుంది.పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుకను జరుపుతారు.
కేవలం ఆమె కోసమే వాళ్ళు తమ సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆ వేడుక చేస్తారు.సాధారణంగా ఎవరూ ఇలా చేయరు.
"ఇవి వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక " అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో కొంత మంది నెటిజన్లు ఈ యాడ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్తున్నారు.
ఈ వీడియో లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని, ఇక మీదట తనిష్క్ ప్రొడక్ట్స్ కొనే ప్రసక్తే లేదని #Boycott Tanishq హ్యాష్ టాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.అయితే ఇంకొంత మంది మాత్రం ఈ యాడ్ లో అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని మతసామరస్యాన్ని పెంచే ఇలాంటి యాడ్ లను ప్రోత్సహించాలని అంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy