మామూలుగా గుడికి, తీర్థయాత్రల వంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది.అంటే అక్కడ ఉండే విధానం, మాట్లాడే విధానం, డ్రెస్సింగ్ విధానం అంతా ఒక పద్ధతిలో ఉంటుంది.
అలాకాకుండా అక్కడ నచ్చినట్లు ప్రవర్తిస్తే చూసే వాళ్లకు కూడా చిరాకు పుడుతుంది.ముఖ్యంగా ధరించే దుస్తుల విషయంలో( Dressing ) మాత్రం సాంప్రదాయంగా ఉండాలి.
అలా కాకుండా షో చేసినట్లు ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉంటారు.సామాన్యులైన సరే ఒక హోదాలో ఉన్న వాళ్ళైనా సరే గుడికి ( Temple ) వెళ్లినప్పుడు సాంప్రదాయమైన దుస్తులలో కనిపించాలి.
లేదంటే అంతే సంగతి.అయితే విష్ణు ప్రియ( Vishnu Priya ) కూడా ఒక గుడికి వెళ్ళినట్లు కనిపించగా ఆ సమయంలో తను ధరించిన దుస్తులను చూసి ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.
ఇంతకు ఆమె ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
విష్ణు ప్రియ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అంతేకాకుండా సోషల్ మీడియా యూజర్లకు కూడా ఈమె బాగా పరిచయం అని చెప్పాలి.యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విష్ణు ప్రియ మొదట్లోనే అందర్నీ ఆకట్టుకుంది.
పోవే పోరా షోలో తన మాటలతో అందరినీ తన వైపుకు మలుపుకుంది.
ఆ తర్వాత పలు షో లలో కూడా కనిపించింది.ఇక ఈమధ్య బాగా ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంది.గతంలో సీరియల్ నటుడు మానస్ తో కలిసి ఒక ఆల్బమ్ చేయగా అది బాగా సక్సెస్ అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం డాన్స్ వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం ఉంది.
ఈమె ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.అప్పుడప్పుడు ఈమె తను పంచుకునే పోస్టుల వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కుంటుంది.కానీ అవేవీ అస్సలు పట్టించుకోదు.ఇక ఇప్పుడు బుల్లితెరకు కాస్త దూరంగా దూరంగానే ఉంది.అంతగా అవకాశాలు అందుకోవటం కూడా లేదు.కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ మాత్రం మంచి క్రేజీ సంపాదించుకుంటుంది.
రీసెంట్గా మానస్ తో మరో ప్రైవేట్ ఆల్బమ్ చేసింది.
ఇక ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.
ఇక అందులో తను వినాయకుడి విగ్రహం ముందు సెల్ఫీ దిగినట్లు కనిపించగా ఆ ఫోటోకు శ్రీరామనవమి శుభాకాంక్షలని పంచుకుంది.అయితే ఆమె దేవుడి దగ్గర ఫోటో దిగే విధానం చూసి ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఆమె వేసుకున్న టీ షర్ట్ ని చూసి మరింత ఫైర్ అవుతున్నారు.ఏదైనా దేవుడి దగ్గరికి వెళితే అక్కడ కాస్త పద్ధతిగా రెడీ అవ్వండి అంటూ నేరుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఆమె పంచుకున్న ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది
.