నా కళ్ళల్లో సంతోషం చూడండంటూ వర్ష బొల్లమ్మ పోస్ట్.. దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలను ట్రోలర్స్ బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రిటీలకు వేదికగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో అందులో చాలా విషయాలు పంచుకుంటుంటారు.

 Netizens Trolls On Heroine Varsha Bollamma Under Water Pics Details, Varsha Boll-TeluguStop.com

అంతేకాకుండా ఫోటోలు కూడా బాగా షేర్ చేస్తూ ఉంటారు.దీంతో కొందరు ట్రోలర్స్ వారు షేర్ చేసే పోస్టులకు బాగా ట్రోల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు.

అంతేకాకుండా వారి అందంపై నెగటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతుంటారు. అయితే తాజాగా వర్ష బొల్లమ్మ ను కూడా బాగా టార్గెట్ చేశారు ట్రోలర్స్.

తమిళ, మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి వర్ష బొల్లమ్మ.అంతే కాకుండా తెలుగు సినిమాలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ.అతి తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.తన పెద్ద పెద్ద కళ్ళతో అందంతో యువత మనసులను దోచుకుంది.

అంతేకాకుండా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో బాగా ఫిదా చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ సందడి చేస్తుంది.

2015 లో తమిళంలో విడుదలైన సతురన్ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వర్ష ఆ తర్వాత ఏడాది వరుస సినిమాలో నటించింది.ఇక 2018 లో కళ్యాణం సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో  అడుగుపెట్టింది.చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది వర్ష.

కానీ ఈ సినిమాతో అంత సక్సెస్ అందుకోలేదు.ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా లో నటించగా మంచి విజయం అందుకుంది.

ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్షకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఇప్పటివరకు ఏ రోజు కూడా గ్లామర్ షో చేసినట్లు అస్సలు కనిపించలేదు.

చాలావరకు పద్ధతిగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అందుకే కుర్రాళ్ళు ఈ ముద్దుగుమ్మ పై మనసు పడుతుంటారు.ఇక ఈ బ్యూటీ తన చూపులతోనే ఎంతోమంది కుర్రాలను పడేసింది.

తన గవ్వ కళ్ళతో అందర్నీ ఆకట్టుకుంది.ఇక కొందరు మాత్రం ఈమెను బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.

వాటిని అసలు పట్టించుకోదు ఈ బ్యూటీ.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో తను అండర్ వాటర్ లో ఉండగా తన కళ్ళను జూమ్ చేసి చూస్తే కళ్ళల్లో ఉండే సంతోషం చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.దీంతో ఓ నెటిజన్ ఏం కనిపిస్తుంది ఐస్ లో.బర్రె కళ్లు అంటూ దారుణంగా ట్రోల్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube