సుమ కనకాల ( Suma Kanakala ) ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ ( Anchor )గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఎంతోమంది ఇండస్ట్రీకి యాంకర్లుగా పరిచయమైనప్పటికీ సుమ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.
ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లి తెర కార్యక్రమాలను కాస్త తగ్గించిన వరుస సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే సుమ యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను సందడి చేస్తూ ఉంటారు.
ఇకపోతే పండగ రోజు సందర్భంగా తన ఇంట్లో పిండి వంటలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె ప్రస్తుతం జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ కష్టపడుతున్నారు.ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె నిన్న తిన్నటువంటి పులిహోర గారెలకు ఇది ప్రాయశ్చిత్తం అంటూ ఈ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారడంతో ఎంతోమందిని డిజైన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు సుమా అక్క నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా ఒక నెటిజన్ మాత్రం ముసలిదాన ఆపు నీ సోది అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేశారు అయితే ఈ నెటిజన్స్ చేసినటువంటి కామెంట్ పై ఇతర నేటిజన్స్ స్పందిస్తూ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.
సుమ ముసలిది అయింది మీరు కలకాలం ఇలాగే యంగ్ గా ఉంటారా అంటూ ఒకరు కామెంట్ చేయగా మరొకరు మన్మధుడు మీరు భూలోకంలోకి ఎప్పుడు వచ్చారు అంటూ సుమకు మద్దతు తెలుపుతూ నెటిజన్ చేసినటువంటి కామెంట్లపై మరికొందరు ఇలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక మరి కొంతమంది అయితే హీరోయిన్స్ కంటే మీరే చాలా అందంగా కనిపిస్తారు అంటూ కూడా సుమకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.