కొందరు ప్రేక్షకులు సినిమాను కేవలం కథ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వరకు చూస్తూ ఉంటారు.కానీ మరికొందరు ప్రేక్షకులు మాత్రం అలా కాదు.
నిజానికి వాళ్లే ఆ సినిమాలో కావాలని వెతికి మరీ తప్పులు తీస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూసే సినిమాలలో కొన్ని పొరపాట్లు చాలా సులువుగా కనిపిస్తుంటాయి.
దీంతో ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.దర్శకులు కూడా వీటిని ప్రేక్షకులు అంతగా పసిగట్టరు అనుకొని పొరపాట్లు చేస్తారు.
కానీ కొన్ని పొరపాట్లను కొందరు ప్రేక్షకులు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు.వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి ఆ సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు.అలా ఇప్పటికీ చాలామంది సినిమాల్లో వచ్చిన పొరపాట్లు గురించి సోషల్ మీడియాలో పెట్టి బాగా ట్రోల్స్ చేశారు.కొన్నిసార్లు దర్శకులు, ఎడిటర్లు కూడా ఇటువంటి పొరపాట్లు పూర్తిగా పరిశీలించి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వాటిని కనిపించకూడదని కొన్ని జాగ్రత్తలు పడుతూ ఉంటారు.
మరికొందరు ప్రేక్షకులు అంతగా ఏమీ గమనించరు అనుకొని పొరపాట్లు చేస్తూ ఉంటారు.కానీ ప్రేక్షకులు పెద్ద పెద్ద సినిమాల విషయంలోనే ఎటువంటి పొరపాట్లు దొరుకుతాయా అని చూస్తారు.
ముఖ్యంగా తమకు నచ్చని హీరో సినిమా ఉంటే మాత్రం బాగా పరిశీలించి మరి ఆ తప్పును బయట పెడుతూ ఉంటారు.ఇక స్టార్ హీరోల సినిమాలలో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు.
చాలా వరకు సినిమా విడుదలైన వెంటనే అందులో ఉన్న పొరపాట్లు ఏంటో గమనిస్తూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు తమకు నచ్చిన హీరో సినిమా తమకు నచ్చకపోతే వెంటనే డైరెక్టర్ ని ట్రోల్ చేస్తూ ఉంటారు.అలా తాజాగా ఓ బాలీవుడ్ హీరోను బాగా ట్రోల్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇంతకు అసలు విషయం ఏంటంటే.
తాజాగా ప్రభాస్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో నటించిన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.
కానీ ఎందుకో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టీజర్ పట్ల నిరాశ చెందుతున్నారు.
టీజర్ ఒకింత బాగున్నప్పటికీ కూడా ప్రేక్షకులకు మాత్రం అంత సాటిస్ఫాక్షన్ లేదు.దీంతో ఈ టీజర్ పై ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
సినిమా షూటింగ్ ను ఒక రూమ్ లో గ్రీన్ మ్యాట్ వేసి తీశారు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
కానీ డైరెక్టర్ మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్ లో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులు చేయించాడు.అయితే ఇందులో రియాల్టీ మిస్ అయినట్టుగా కనిపిస్తుంది.ఏదేదో చేసేసి.
ప్రభాస్‌కు బాడీ తగిలించినట్టుగా గ్రాఫిక్స్‌లో అడ్జస్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది తప్పా ఒరిజినల్ కాదంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇదంతా కూడా చిన్నప్పుడు డిస్నీ చానెల్లో చూసినట్టుగా అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా వానర సేన కూడా గొరిల్లాలా కనిపిస్తున్నాయని ట్రోల్స్ చేస్తున్నారు.అలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా టీజర్ పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.
ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం.ఆ బాలీవుడ్ డైరెక్టర్ కావాలని ప్రభాస్ ను అవమానించాడు అని బాగా ఫీలవుతున్నారు.