కూతురు డాన్స్ కు ఫిదా అవుతున్న మహేష్ బాబు.. గౌతమ్ ను లాగుతున్న నెటిజన్స్?

ఏ తల్లిదండ్రులైన తమ బిడ్డ ఎదుగుతున్న కొద్దీ సంతోషంతో మురిసిపోతూ ఉంటారు.వాళ్లల్లో ఉన్న టాలెంట్ ని చూసి ఫిదా అవుతూ ఉంటారు.

 Netizens Involving Gautam As Mahesh Babu Mesmerized By Sitara Dance Video Viral-TeluguStop.com

కేవలం సామాన్యులే కాదు సెలబ్రెటీలు, మంచి హోదాలో ఉన్న వాళ్లు కూడా తమ పిల్లలు ఎదుగుతుంటే పదిమందికి చెబుతూ సంతోషపడుతూ ఉంటారు.అలా తాజాగా మహేష్ బాబు తన కూతుర్ని చూసి ఫిదా అయ్యాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మహేష్ బాబు గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.ఆయన నటుడుగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

వారిని అభిమానులుగా మార్చుకున్నాడు.సిని ఇండస్ట్రీకి బాలనటుడుగా అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు వెక్కి హీరోగా ఎదిగాడు.

అలా హీరోగా ఎదిగిన కొంతకాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు మహేష్ బాబు.ఇక తనతో కలిసి నటించిన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఇక పెళ్లి తర్వాత ఈ జంట ఇప్పటివరకు ఎటువంటి మచ్చ తెచ్చుకోకుండా టాలీవుడ్ క్యూట్ కపుల్ గా మిగిలారు.ఇక వీరికి ఒక పాప సితార, బాబు గౌతమ్ ఉన్నారు.

ఇక నమ్రత పెళ్లికి పెళ్లికి ముందు ఎన్నో సినిమాల్లో నటించగా.పెళ్లి తర్వాత తన పెళ్లి జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పింది.

అప్పటినుంచి ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా నటించలేదు.కేవలం కుటుంబ బాధ్యతలు మోస్తూ.పలు బిజినెస్ లు చేస్తూ ఉంది.ఇక మహేష్ బాబు కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇస్తాడు.ఎప్పుడు సినిమాలే కాకుండా కుటుంబంతో కూడా  మంచి సమయాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటాడు.వారితో బయటికి ట్రిప్స్ అంటూ తిరుగుతూ బాగా సందడి చేస్తూ ఉంటాడు.

ఇక పిల్లలు ఇద్దరు తమంత ఎత్తు కూడా కాగా వారికి ఇతర యాక్టివిటీస్ లను కూడా అందిస్తున్నారు.వీరి కూతురు సితార మాత్రం అన్ని విషయాలలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

చిన్నప్పటినుండి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీతార. ఇప్పుడు ఒక అభిమానాన్ని పెంచుకుంది.

ఎందుకంటే సితార సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి.

నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది.ఇప్పటికే బుల్లితెరపై కొన్ని షోలల్లో కూడా అడుగు పెట్టింది.అయితే ఇదంతా పక్కన పెడితే.

నమ్రత, మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ పిల్లలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఉంటారు.అయితే తాజాగా సితార ఒక తెలుగు పాటకు  అద్భుతంగా డాన్స్ చేస్తూ తన స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది.

దీంతో ఆ డాన్స్ కు ఫిదా అయిన మహేష్ బాబు వెంటనే తన కూతురు వీడియో తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.ఇక వీడియో చూసిన వాళ్లంతా సితార డాన్స్ కు ఫిదా అవుతున్నారు.

ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక కొంతమంది గౌతమ్ ను లాగుతూ.

నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని గౌతమ్ అనుకుంటున్నాడు అని మీమ్స్ లాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube