టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు శివ బాలాజీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగులో పలు సినిమాలలో హీరోగా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు.
కొన్ని సినిమాలలో సెకండ్ హీరోగా కూడా చేశాడు.కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.
బయట పలు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు.
ఈయన సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 2003లో ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ అనే సినిమాతో పరిచయమయ్యాడు.
అదే ఏడాది ఎలా చెప్పను అనే సినిమాలో కూడా నటించాడు.దీంతో తన నటనకు మంచి పేరు రావడంతో ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో హీరోగా, సెకండ్ హీరోగా చేశాడు.
ఇక ఈయన మరొకటి మధుమితను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే గతంలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.ఇక గతంలో బిగ్ బాస్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొని టైటిల్ విన్నర్ గా నిలిచాడు.
ఇక హౌస్ లో ఉన్నంతకాలం శివ బాలాజీ చేసిన రచ్చ అంతా కాదు.ఆ తర్వాత బుల్లితెరపై మరిన్ని షోలల్లో కూడా కనిపించాడు.
ఈయన వ్యక్తిగతంగా కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.
కోవిడ్ సమయంలో ఈయన తన పిల్లలు చదువుకునే స్కూల్ పై ఫీజు విషయంలో ఎంతలా రాద్ధాంతం చేశాడో అందరికీ తెలిసింది.కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని బాగా హాట్ టాపిక్ గా తీశాడు శివ బాలాజీ.పైగా ఆ స్కూల్ యాజమాన్యం పై కేసు వేసి చాలా పరువు తీసే విధంగా ప్రవర్తించాడు.
అలా ఆ విషయంలో అప్పట్లో బాగా హాట్ టాపిక్ గా మారాడు శివబాలాజీ.
ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.
ఈయన భార్య మధుమిత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఇక వీళ్ళు వంటలు చేసే వీడియోలను బాగా షేర్ చేసుకుంటూ ఉంటారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా శివబాలాజీ ఒక షోకు జడ్జిగా బాధ్యతలు చేపట్టాడు.
ఇంతకు ఆ షో ఏంటంటే.మిస్టర్ అండ్ మిసెస్.ఈటీవీలో ప్రసారం కానున్న ఈ షోకు శ్రీముఖి యాంకర్ గా బాధ్యతలు చేపట్టింది.
ఇక ఇందులో హీరోయిన్స్ స్నేహ, శివ బాలాజీ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.అయితే దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది.
అందులోబుల్లితెర సెలబ్రిటీలంతా పాల్గొని బాగా సందడి చేసినట్లు కనిపించారు.అయితే జడ్జిగా శివ బాలాజీ ఉండటంతో.
నెటిజన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.ఒక స్కూల్ ను బ్యాడ్ చేసిన శివ బాలాజీ జడ్జి ఏంటి రా అంటూ.
వరస్ట్ శివ బాలాజీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.దీంతో ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.