Avinash: ఈ టైంలో ఇలా అవుతుందనుకోలేదంటూ అవినాష్ వీడియో.. ఏకీపారేస్తున్న నెటిజన్స్?

సామాన్యులు, సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ప్రతి విషయాలను అందరికీ పంచుకుంటూ ఉన్నారు.ఏ చిన్న విషయాన్ని అయినా అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు.

 Netizens Fires On Jabardasth Mukku Avinash Video-TeluguStop.com

అయితే సామాన్యుల విషయం పక్కకు పెడితే సెలబ్రెటీలు ( Celebrities ) పంచుకునే వీడియోస్ కి మాత్రం బాగా వ్యూస్ వస్తూ ఉంటాయి.కారణం వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుందని.

పైగా వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవటానికి కూడా జనాలు ఆసక్తి చూపిస్తుంటారు కాబట్టి.

అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది సెలబ్రెటీలు తమ వీడియోలతో బాగా అతి చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా యూట్యూబ్ లలో( Youtube ) వీడియోస్ పంచుకుంటూ బాగా షో చేస్తూ ఉంటారు.అక్కడ మ్యాటర్ లేకున్నా కూడా ఉన్నట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు.దీంతో జనాలు వెంటనే వారిని ఏకీపారేస్తుంటారు.ఇప్పుడు తాజాగా ముక్కు అవినాష్( Mukku Avinash ) విషయంలో కూడా జనాలు అతనిపై బాగా ఫైర్ అవుతున్నారు.

ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పాలి.

జబర్దస్త్ లో( Jabardasth ) ఉన్నంతకాలం తన కామెడీతో అందరినీ తెగ నవ్వించాడు.ఇక బిగ్ బాస్ లో( Bigg Boss ) అవకాశం రావడంతో జబర్దస్త్ కు దూరమయ్యాడు.

అయినప్పటికీ కూడా ఇతర షోలతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాడు.వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

Telugu Anuja, Avinash, Avinash Anuja, Bigg Boss, Mukku Avinash, Jabardasth-Movie

ఇక ఈయన చేసే కామెడీ మాత్రం బాగా క్లిక్ అవుతూ ఉంటుంది.అప్పుడప్పుడు తన గెటప్ తో, మాటతీరుతో అందర్నీ బాగా నవ్విస్తూ ఉంటాడు.ఇక బిగ్ బాస్ తర్వాత అతడు అనూజ( Anuja ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ఒకవైపు కెరీర్ ను మరొకవైపు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.

అంతేకాకుండా తన భార్యను కూడా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

తను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

ఇక వీరిద్దరి పేరు మీద యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉండగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకున్నారు.అప్పుడప్పుడు వీళ్ళు పంచుకునే వీడియోస్ పట్ల విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి.

సమయం, సందర్భం లేకుండా వీళ్ళు పంచుకునే వీడియోలను చూసి జనాలు బాగా తిడుతూ ఉంటారు.

Telugu Anuja, Avinash, Avinash Anuja, Bigg Boss, Mukku Avinash, Jabardasth-Movie

గతంలో అవినాష్ తల్లి( Avinash Mother ) హాస్పిటల్ లో ఉండగా ఆ సమయంలో వీడియో తీయడంతో జనాలు బాగా ఫైర్ అయ్యారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో వీడియో పంచుకోగా.ఆ వీడియోకు.

ఈ టైంలో ఇలా అవుతుందనుకోలేదు అంటూ తను తన భార్య బాధపడుతున్న ఫోటోను థంబ్ నెయిల్ లో పెట్టాడు.దీంతో జనాలు ఏం జరిగిందా అని వీడియో లోపలికి వెళ్లి కంటెంట్ పూర్తిగా చూసి దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

అయితే అసలు విషయం ఏంటంటే అవినాష్ భార్య ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.రీసెంట్ గా శ్రీమంతం వీడియో కూడా పంచుకున్నాడు అవినాష్.అయితే తను అలా ఫోటో పెట్టి అలా టైటిల్ పెట్టటంతో.అవినాష్ భార్యకు ఏం జరిగిందో అని జనాలు భయపడ్డారు.

ఇక వీడియోలో చూస్తే తన భార్యకు స్కానింగ్ తీసుకెళ్లడానికి వెళ్తున్నాను అని.ఇక తను తన తల్లి గారి ఇంటికి వెళ్తుందని బాధపడుతూ కనిపించాడు.

Telugu Anuja, Avinash, Avinash Anuja, Bigg Boss, Mukku Avinash, Jabardasth-Movie

వెంటనే జనాలు అవినాష్ పై ఫైర్ అవుతున్నారు.పెట్టిన థంబ్ నెయిల్ ఏంటి లోపల చూపించిన వీడియో ఏంటి.జనాలను భయపెట్టించావు కదా.అని ఏకీపారేస్తున్నారు.వ్యూస్ కోసం అలా పెట్టడం అవసరమా.అంత ఓవరాక్షన్ చేయటం అవసరమా.వ్యూస్ కోసం తప్పుడు రాతలు రాయొద్దు అంటూ.ఇంతలా దిగజారి పోవాలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఆ వీడియోతో పాటు కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube