సీతారామం హీరోయిన్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. పరువు పోయిందంటూ?

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చినా ఈ సినిమా థియేట్రికల్ కలెక్షన్లు సైతం ఊహించని స్థాయిలో ఉన్నాయి.

 Netizens Fire On Seetharamam Heroine Details Here Goes Viral , Seethramam Movie,-TeluguStop.com

ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారు.తను తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరనే రేంజ్ లో మృణాల్ ఠాకూర్ మెప్పించడం గమనార్హం.

భాషతో సంబంధం లేకుండా సీతారామం మూవీ సక్సెస్ సాధించింది.అయితే సీతారామం సక్సెస్ తో మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్ ను పెంచేశారని సమాచారం అందుతోంది.సీతారామంకు కోటి రూపాయల పారితోషికం తీసుకున్న ఈ హీరోయిన్ ఆ రెమ్యునరేషన్ ను రెట్టింపు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.అయితే ఒక విషయంలో మాత్రం మృణాల్ ఠాకూర్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

సీతారామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను, హాట్ ఫోటోలను షేర్ చేస్తుండగా ఆ ఫోటోల విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చెత్త ఫోటోషూట్స్ చేస్తూ మృణాల్ పరువు పోగొట్టుకుంటోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Telugu Mrinal Thakur, Seetharamam, Seethramam-Latest News - Telugu

కొంతకాలం పాటు మృణాల్ ఠాకూర్ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటే బెటర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ కామెంట్లపై మృణాల్ ఠాకూర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.మృణాల్ ఠాకూర్ కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.మృణాల్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు మృణాల్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మృణాల్ ఠాకూర్ కు భారీగానే ఆఫర్లు వస్తున్నాయని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube