Bigg Boss Siva Jyoti : ఎందుకు బిల్డప్ ఇస్తున్నావంటూ బిగ్ బాస్ శివ జ్యోతిపై నెటిజన్స్ ఫైర్.. కారణమేంటంటే?

కొన్ని కొన్ని సార్లు సెలబ్రేటీలు అనవసరంగా షో చేస్తూ బాగా ట్రోల్స్ ఎదుర్కొంటారు.ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ కావడంతో అందులో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం మరింత ట్రోల్స్ చేస్తున్నారు.

 Netizens Fire On Bigg Boss Siva Jyoti Saying Why She Is Giving A Build Up What-TeluguStop.com

సోషల్ మీడియా వేదిక ఉందని ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం వల్ల నెటిజన్స్ బాగా చిరాకు పడుతూ ఉంటారు.ఇక మరి కొంతమంది సెలబ్రిటీలు వీడియోస్ కోసం కావాలని ఓవర్ చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని ప్రతి వీడియోతో బాగా రెచ్చిపోతున్నారు.ఏదైనా ఆసక్తిగా అనిపించే దాని గురించి వీడియో తీసి షేర్ చేస్తే బాగుంటుంది కానీ ప్రతిసారి షాపింగులు, తొక్క.

తోటకూర అంటే.చూసే ఫాలోవర్స్ కచ్చితంగా చిరాకు పడుతుంటారు.

ఇప్పుడు యాంకర్ శివ జ్యోతి విషయంలో కూడా నెటిజన్స్ అలాగే ఫైర్ అవుతున్నారు.అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

తీన్మార్ సావిత్రిగా శివ జ్యోతి తెలుగు ప్రేక్షకులకు మంచి యాంకర్ గా పరిచయమయ్యింది.తన తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.దీంతో ఆమెకు మంచి అభిమానం ఏర్పడటంతో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.అందులో తన ఆటపాటలతో మరింత పరిచయం పెంచుకుంది.

అయితే బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి.ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం చాలా మార్పు వచ్చింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి మంచి డ్రెస్సులను ధరించిన శివ జ్యోతి బయటికి వచ్చాక తన గ్లామర్ ను పరిచయం చేసింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ గా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది.

Telugu Biggboss, Sivajyoti, Tinmar Savitri-Movie

తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి బాగా సందడి చేస్తూ ఉంటుంది.సమయం వచ్చిన్నప్పుడల్లా వారితో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శివ జ్యోతి.ఇక ఇటీవల యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.

చాలా వరకు నగలు కొన్నాను అంటూ, చీరలు కొంటున్నాను అంటూ వీడియోస్ బాగా పంచుకుంటుంది.

Telugu Biggboss, Sivajyoti, Tinmar Savitri-Movie

అయితే మళ్ళీ తాజాగా ఒక వీడియో షేర్ చేయగా అందులో కూడా పండుగ కోసం చీరలు కొన్నాను అంటూ దానికి సంబంధించిన పోస్టును ఇన్ స్టాల్ లో పంచుకుంది.ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ నీకు ఎప్పుడు ఇదే పనా.ఎప్పుడు బంగారాలు, చీరలు కొనడమేనా అంటూ కామెంట్ పెట్టారు.ఓ నెటిజన్ మాత్రం.షాపు వాడికి ప్రమోషన్ చేసి అన్ని దొబ్బుతున్నావు.కానీ ఏదో కొన్నట్లు పెద్ద బిల్డప్ ఇస్తున్నావు అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.మరి దీనికి శివ జ్యోతి ఏమని స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube