బాలయ్య బింబిసారగా నటించి ఉంటే మూవీ అలా ఉండేదా.. నెటిజన్ల కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనే సంగతి తెలిసిందే.గతేడాది అఖండ సినిమాలో నటించి బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

 Netizens Comments Viral About Balakrishna Bimbisara Movie Details Here , Bimbisa-TeluguStop.com

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది.ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తోంది.

అయితే సోషల్ మీడియాలో బింబిసార పాత్రలో బాలయ్య నటిస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది.బాలయ్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో సైతం అద్భుతంగా నటించగలరు.

సుల్తాన్, పలు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి బాలకృష్ణ ప్రేక్షకుల ప్రశంసలు పొందారనే సంగతి తెలిసిందే.బాలయ్య బింబిసార సినిమాలో నటించి ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగి ఉండేదని నెటిజన్లు భావిస్తున్నారు.

మరోవైపు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.కళ్యాణ్ రామ్ నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా ఆ సినిమాలు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.

ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో 40 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు.

Telugu Bimbisara, Nandamurikalyan, Naveen Medaram, Netizens, Sulthan-Movie

బింబిసార పార్ట్1 సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో బింబిసార పార్ట్2 పై అంచనాలు పెరగడంతో పాటు ఈ సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.మరోవైపు కళ్యాణ్ రామ్ నవీన్ మేడారం అనే డైరెక్టర్ డైరెక్షన్ లో డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నారు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube