మామూలు బరువుతో ఉన్న హీరోయిన్లు కూడా మరింత సన్నబడుతున్నారు.ఎందుకంటే అవకాశాల కోసం.
అవును అవకాశాల కోసం హీరోయిన్లు దేనికైనా సిద్ధపడుతున్నారు.ఎప్పటికప్పుడు దర్శక నిర్మాతలను మెప్పించడానికి సన్నబడటమే టార్గెట్ అని సన్నగా తయారవుతున్నారు.
దానివల్ల వారికి లాభం ఏమిటో తెలియదు కానీ.వాళ్ళ శరీరం, ముఖం చూస్తే మాత్రం అస్తిపంజరాలుగా అనిపిస్తుంటాయి.
వారి శరీరంలో ఉన్న ఎముకలు కూడా బయటికి కనిపిస్తూ ఉంటాయి.ఇక ముఖం మాత్రం పూర్తిగా మారిపోతుంది.చెంపలు లోపలికి చిక్కిపోతుంటాయి.దీనివల్ల వచ్చే అవకాశాలు కూడా పోతుంటాయి.
హీరోయిన్ గా కొనసాగాలి అంటే మంచి ఫిజిక్ తో పాటు, మంచి అందం ఉండాలి కానీ.అలా బక్క చిక్కిపోతే ఎవరు అవకాశాలు ఇవ్వరు.
ఇప్పుడు అటువంటి పరిస్థితినే చాందిని చౌదరి ఎదుర్కొంటుంది.
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి చాందిని చౌదరి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి.మొదట్లో చాందిని పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించగా. అక్కడ మంచి సక్సెస్ అందుకోవడంతో వెండితెరపై అవకాశం అందుకుంది.
వెండితెరపై అడుగుపెట్టిన మొదట్లో చాలావరకు అంత సక్సెస్ అందుకోలేకపోయింది.కానీ ఇప్పుడు మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది.
తొలిసారిగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పరిచయమైంది చాందిని చౌదరి.ఆ తర్వాత ఏడాది ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం, కుందనపు బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జి వంటి సినిమాలలో నటించగా తను నటించిన పాత్రలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేనివి.
కానీ 2020 లో విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది.
ఆ సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది.అందులో సమ్మతమే అనే సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించింది.
ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి అభిమానం ఉంది.ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కూడా మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం గ్లామర్ షో కూడా చేస్తుంది.
పొట్టి పొట్టి బట్టలతో కూడా అందరికీ షాక్ ఇస్తుంది.తెలుగు భాషకు చెందిన అమ్మాయి అయినా కూడా సంప్రదాయాలు అన్ని మర్చిపోయి గ్లామర్ షో చేయడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో ట్రెడిషనల్ లుక్ లో బాగా అదరగొట్టింది.అయితే ఒకప్పుడు ఈ బ్యూటీ కాస్త బొద్దుగా అనిపించేది.ఎప్పుడైతే అవకాశాల కోసం తాపత్రయపడటం మొదలుపెట్టిందో అప్పటినుంచి బాగా సన్నగా మారింది.అయితే తాజాగా పంచుకున్న ఫోటోలో ఆమె బాగా బక్క చిక్కిపోయింది.దీంతో ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
సైజ్ జీరో ఎమో కానీ.మరీ పీకపోయి.
పీలా ముఖంతో ఫేస్ లో గ్లో లేక బాగాలేరు అంటూ ఓ నెటిజన్ షాక్ ఇచ్చారు.