టాలీవుడ్ బుల్లితెర ఆర్టిస్ట్, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి.తన అందాలతో కుర్రాళ్ళ మతి పోగొట్టేసింది ఈ బ్యూటీ.
తెలుగు అమ్మాయి అయినా ఈమె మొదట టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడింది.ఆ తర్వాత షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.
అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా కూడా అవకాశాలు వచ్చాయి.
ఇక బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం వచ్చింది.
అలా గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి పలు సీరియల్స్ లో కూడా నటించింది.
ఇక జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టగా హైపర్ ఆది టీంలో పనిచేసి అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.
ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.
పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే కొన్ని రోజుల కిందట తన తండ్రి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.తన తండ్రి కూడా ఈమెతో చాలా రీల్స్ చేశాడు.అలా తన తండ్రి కూడా సోషల్ మీడియాలో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన మరణించాక ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపి బాగా ఎమోషనల్ అయింది రీతూ చౌదరి.
తన తండ్రి చేసిన వీడియోలను బాగా పంచుకొని ఎమోషనల్ అయ్యింది.ఆ తర్వాత నుంచి తను మళ్లీ యధావిధిగా రీల్స్ చేస్తూ ఫోటోషూట్ లు చేయించుకుంటూ బాగా బిజీగా మారింది.దీంతో అప్పటినుంచి ఆమెను నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
తండ్రి చనిపోయిన బాధ కూడా లేదు అప్పుడే రీల్స్ చేస్తున్నావా అంటూ కామెంట్లు కూడా చేశారు.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె తిరుమల కి వెళ్ళగా అక్కడ టెంపుల్ లో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ కనిపించింది.తాజాగా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇవ్వగా ఆ ఫోటోలను కూడా పంచుకుంది.అయితే ఫోటోలను చూసిన నెటిజన్స్ ఆమెను మరోసారి ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.
అంతే కాకుండా వెటకారంగా కూడా కామెంట్లు చేశారు.డాడ్ చనిపోయి కొన్ని రోజులు కూడా కాలే అప్పుడే టెంపుల్.
గ్రేట్ అంటూ ఓ నెటిజన్ వెటకారం చేయగా.వెంటనే మరో నెటిజన్.
తండ్రి చనిపోయిన మూడు రోజులకు రీల్స్ చేసింది ఈమె.ఏంటో అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.