Sri Reddy :శ్రీరెడ్డి వీడియోకు ఫిదావుతున్న నెటిజన్స్.. ఇకపై ఆ పనులు మానేయంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి( Sri Reddy ) పేరు వింటే చాలు అమ్మో ఫైర్ బ్రాండ్ అని అంటారు.ఎందుకంటే ఈమె చేసిన రచ్చ అటువంటిది కాబట్టి.

 Netizens Are Addicted To Sri Reddys Video Will They Stop Doing That-TeluguStop.com

గతంలో ఈ హాట్ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో బాగా రచ్చ చేసింది.ఆ సమయంలో అందరి దృష్టిలో పడి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చి హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈమె మాట్లాడే మాటలు వింటే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.

నిజానికి అవి మాటలు కావు బూతులని అనాలి.ఆమె ఏదైనా విషయం గురించి మాట్లాడాలి అంటే అందులో మాటలు కంటే ఎక్కువగా బూతులే ఉంటాయి.

ఇక ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయేసరికి సోషల్ మీడియా ద్వారా అందరికీ టచ్ లో ఉంటుంది.

నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.రాజకీయా నాయకులను కూడా అస్సలు వదలట్లేదు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.ఇక సోషల్ మీడియాలలో ఆమె ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.

ఇక తాను వేసుకునే డ్రస్ లు మాత్రం తన అందాలను బయటపెడతాయి.

కేవలం తన ఫోటోలతో రచ్చ చేయడమే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.కొన్ని రోజుల కిందట యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుని అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.

అయితే గత కొన్ని రోజుల నుండి శ్రీరెడ్డి లో కొన్ని కొన్ని మార్పులు కనిపించాయి.

ముఖ్యంగా వంటల ప్రోగ్రాంతో అందరికీ షాక్ ఇస్తుంది.రకరకాల వంటలు చేస్తూ కొన్ని నీతి సూక్తులు పంచుకుంటుంది.కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి కూడా పంచుకుంటుంది.

ముఖ్యంగా సీ ఫుడ్ లాంటివి చేస్తూ అందులో తన అందాలను వడ్డిస్తూ బాగా రచ్చ చేస్తుంది.ఇక అప్పుడప్పుడు మంచి మంచి విషయాలు కూడా పంచుకుంటుంది.

దీంతో నెటిజన్స్ ఈమెపై కాస్త అభిమానం చూపిస్తున్నారు.ఒకప్పుడు ఈమె పై నెగటివ్ కామెంట్లు చేసిన వాళ్లంతా ఇప్పుడు చేతులెత్తి దండం పెడుతున్నారు.తన వీడియోలకు సపోర్ట్ ఇస్తున్నారు.తాజాగా ఒక చిన్న వీడియో క్లిప్ షేర్ చేసుకుంది.

అమ్మ, నాన్న, చెల్లి కలిసి సత్యనారాయణ వ్రతం చేసాము అంటూ వీడియో పంచుకుంది.

ఆ వీడియోలో తనతో పాటు తన అమ్మను, చెల్లెలు కూడా చూపించింది.

ఇక అందులో శ్రీ రెడ్డి చాలా పద్ధతిగా కనిపించింది.దీంతో ఆ వీడియో చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.

మరికొంతమంది ఆమెలో వచ్చిన మార్పు కి ఫిదా అవుతున్నారు.ఇకపై బూతు మాటలు మాట్లాడకండి అంటూ.

కాస్త పద్ధతిగా తయారవ్వండి అంటూ సలహాలు ఇస్తున్నారు.

https://youtube.com/shorts/c0k46FBIyIg?feature=share
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube