మామూలుగా కొంతమందికి భూమాతకు ఉన్నంత ఓపిక ఉంటుంది.కానీ ఈ జనరేషన్ లో మాత్రం అంత ఓపికతో ఉన్నవాళ్లు చాలా తక్కువ అని చెప్పాలి.
సామాన్యులైన, ఒక హోదాలో ఉన్న వాళ్ళైనా ఉన్నంతవరకే ఉంటారు.అంతేకానీ అంతకుమించి ఓపికతో అస్సలు ఉండలేక పోతారు.
కానీ తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటి చాలా ఓపికగా కనిపించింది.మామూలుగా ఇండస్ట్రీకి చెందిన నటీనటులలో కూడా ఓపిక చాలా తక్కువే.
కానీ హీరోయిన్ లయకు( Laya ) మాత్రం చాలా ఓపిక ఉంది.నిజానికి ఆమె ఓపికను చూసి ఫిదా అవుతున్నారు జనాలు.
మరి ఆమె ఓపిక జనాలకు ఎక్కడ కనిపించిందో చూద్దాం.ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది లయ.అప్పట్లో తన నటనని చూసి ఫిదా అయినా ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.కానీ అంత త్వరగా ఇండస్ట్రీకి దూరం అవుతుంది అని ఎవరు ఊహించుకోలేదు లయ ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులతో మంచి పరిచయం పెంచుకుంది.
అలా చాలావరకు స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్లలో తాను ఒక్కరిగా నిలిచింది.ఇక లయకు సంగీతం, డాన్స్ పట్ల మంచి అవగాహన ఉంది.ఇక హీరోయిన్ గా ఉన్న సమయంలోనే అనగా 2006 లో డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీని( Dr.Shri Ganesh Gorty ) వివాహం చేసుకుంది.ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
ప్రస్తుతం లయ తన ఫ్యామిలీతో లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో స్థిరపడింది.
ఇక పెళ్లి తర్వాత లయ సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీని చూసుకుంటుంది.అయితే ఈమధ్య సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉండటంతో లయ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.సినిమాలకు దూరంగా ఉంటున్న కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు బాగా టచ్ లో ఉంటుంది.
లయ ఎక్కువగా డాన్స్ వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇప్పటికీ ఆమె ఎనర్జీ అస్సలు తగ్గలేదు అని చెప్పాలి.ఒకప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది లయ.శరీరంలో ఎటువంటి మార్పులు లేకుండా అంతే అందంతో ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఇక అటువంటి అందంతో మంచి మంచి డ్రెస్సులను ధరించి తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా డాన్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో డాన్స్ వీడియో షేర్ చేసుకుంది.ఇందులో తన ఫ్రెండ్స్ తో పాటు తను కూడా అద్భుతంగా డాన్స్ చేసింది.ఇక ఆ వీడియో చూసి నెటిజన్స్ బాగా ఫిదా అవుతున్నారు.
అంతేకాకుండా బాగా చేశారు అంటూ కామెంట్ల ద్వారా బాగా ప్రశంసిస్తున్నారు.దీంతో లయ కూడా తిరిగి వారికి కామెంట్ల ద్వారా రిప్లై ఇచ్చింది.
అలా మెసేజ్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఓపికగా రిప్లై ఇచ్చింది.దాదాపు 80 మందికి పైగా రిప్లైలు ఇచ్చింది.
మామూలుగా ఏ సెలబ్రెటీలు అయినా నెటిజన్స్ కు అలా రిప్లై ఇవ్వరు.అసలు ఇవ్వటానికి కూడా వాళ్లు ఆసక్తి చూపించరు.
కానీ లయ మాత్రం ఓపికగా అంతమందికి గుడ్ మార్నింగ్ అని, థాంక్స్ అని చెప్పటంతో ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.దీంతో కొంతమంది మాత్రం.
మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చారు మీది ఎంత మంచి మనసో అంటూ పొగుడుతున్నారు.మరి కొంతమంది ఆమెను సినీ ఇండస్ట్రీకి మళ్ళీ రమ్మని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy