మామూలుగా జనాలకు ఎవరైనా నచ్చితే వారిని అసలు వదలరు.వారిపై విపరీతమైన అభిమానం చూపిస్తూ ఉంటారు.
కానీ నచ్చకపోతే మాత్రం అసలు పట్టించుకోరు.ముఖ్యంగా సెలెబ్రెటీల విషయంలో మాత్రం ఇవి చాలా కనిపిస్తూ ఉంటాయి.
జనాలకు ఎవరైనా సెలబ్రెటీ నచ్చితే వారిపై విపరీతమైన అభిమానం చూపిస్తారు.నచ్చకపోతే వారిని ట్రోల్ చేస్తారు.
కొన్ని కొన్ని సార్లు వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు.
ఒకప్పుడు ఇటువంటివి అసలు కనిపించేవి కాదు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా( Social media ) అందుబాటులో ఉండటం వల్ల సెలబ్రెటీలను జనాలు ఏమన్నా కూడా వెంటనే కామెంట్ల ద్వారా తెలిసిపోతుంది.కొన్ని కొన్ని సార్లు పరువు తీసే విధంగా కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు.
సెలబ్రెటీలు ( Celebrities ) అతిగా ప్రవర్తిస్తే మాత్రం ఇక అంతే సంగతి అని చెప్పాలి.
ఇప్పటికే కొంతమంది ఆర్టిస్టులను నెటిజిన్స్ అస్సలు వదలడం లేదు.నిజానికి ఆ ఆర్టిస్టుల ప్రవర్తన కూడా అలాగే ఉంది.టాలెంట్ లేకున్నా కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతిగా షో చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు.
ఇక అందులో ఒకరు రీతూ చౌదరి( Rithu chowdary ) అని చెప్పాలి.ఈమె ఏ పోస్ట్ షేర్ చేసిన చాలు ఎవరో ఒకరు ఈమెను ట్రోల్ చేయకుండా ఉండరు.
నెగటివ్ కామెంట్లతో బాగా దూషిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఈమె షేర్ చేసిన పోస్ట్ కు ఓ నేటిజన్ బాగా ట్రోల్ చేశారు.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.
తెలుగు బుల్లితెర నటి, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.
కెరీర్ మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి మంచి అభిమానం సంపాదించుకుంది.ఆ తర్వాత కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.
అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం రావడంతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో( Gorintaku serial ) అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.
ఇక ఓసారి కామెడీ షో జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టింది.ఇక తొలిచూపులతో జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.
కానీ ఆమె ఎప్పుడూ యాక్టింగ్ చేసినట్లు కనిపించలేదు.ఎప్పుడు చూసినా జబర్దస్త్ లో నవ్వుతూ కనిపించేది.ఇక ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేస్తే చాలు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.
అందులో తను ఏం యాక్టింగ్ చేసినట్లు కనిపించకపోగా కేవలం నవ్వుతో, నడుము అందాలతోషో చేస్తూ కనిపించింది.
దీంతో ఆ వీడియో చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఓ నెటిజన్.టాలెంట్ చూపియందే నీకు నిద్ర పట్టదు.
ఇలాంటి వాళ్లకు లైక్ కొట్టకండంటూ కామెంట్ చేయగా మరో నెటిజన్.జబర్దస్త్ లో టాలెంట్ ఎక్కడ మేడం కేవలం నవ్వడం తప్ప అంటూ షాక్ ఇచ్చారు.